calender_icon.png 9 October, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోకల్‌కు లైన్ క్లియర్

09-10-2025 01:46:04 AM

ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నేడు నోటిఫికేషన్

  1. ఉదయం 10:30 గంటలకు.. 

మొదటి విడతలో ఎంపీటీసీలు: 2,963 జడ్పీటీసీలు: 292 

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి) :  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్ అయింది. నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి స్టే ఇచ్చేం దుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో మొద టి విడత  జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు గురువారం  ఉదయం 10:30 గంటలకు  ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే పోటీ చేసే అభ్యర్థుల నుంచి  నామినేషన్లు స్వీకరించనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వాలని పిటిషన ర్ కోరారు.

అయితే విజ్ఞప్తిని హైకోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో రా ష్ట్ర ఎన్నికల కమిషన్ ఇటీవలనే విడుదలచేసిన షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగానే గురు వారం ఎన్నికల  నోటిఫికేషన్ ప్రక్రియ య థావిథిగా కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తొ లుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు  రెండు విడుతలు, ఆ తర్వాత సర్పంచ్, వార్డు స్థానాలకు మూడు విడతల్లో మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

రెండు విడతల్లో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 9న నామినేషన్లు ప్రారంభమై.. 11వ తేదీన ము గుస్తుంది. ఇక మూడు విడతల్లో జరిగే సర ్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలు ఈ నెల 17న నోటిఫికేషన్ విడుదల కానున్నది. మొదటి, రెండో విడత ఎన్నికలకు సంబంధిచి నవంబర్ 11న కౌంటింగ్ జరగనుంది. 

14 ఎంపీటీసీ, 25 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు లేవు.. 

 వివిధ కారణాలతో న్యాయస్థానాలు స్టే విధించిన కారణంగా 14 ఎంపీటీసీ,  27 స ర్పించ్, 246 వార్డు స్థానాలకు ఎన్నికలు నిలిపివేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ములుగు జిల్లా మంగపేట మండలంలోని 14 ఎంపీటీసీ, 25 సర్పంచి, 230 వార్డులుండగా, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మం డలంలోని రెండు సర్పించి, 16 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని పేర్కొన్నది. 

ముగ్గురు పిల్లలుంటే అనర్హులే.. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హత వేటు నిబంధన ఈ ఎన్నికల్లోనూ అమలు కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ఈ చట్టానికి  సవరణ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే సమయాభావం కారణంగా శాసన సభలో ప్రభుత్వం చట్టం చేయలేదు. దీంతో ముగ్గురు పిల్లున్నవారు ఈ ఎన్నికల్లో పోటీకి అనర్హులని అధికారులు ప్రకటించారు.  

మొదటి విడతలో.. 

ఎంపీటీసీలు  2,963, జడ్పీటీసీలు  292 

నామినేషన్ల స్వీకరణ ప్రారంభం  9 అక్టోబర్ 

చివరి తేదీ  11 అక్టోబర్ 

పరిశీలన  12 అక్టోబర్ 

ఉప సంహరణ  15 అక్టోబర్ 

పోలింగ్   23 అక్టోబర్  రెండో విడతలో..

ఎంపీటీసీ జడ్పీటీసీ  స్థానాలకు ఎన్నికలు 

నామినేషన్ల స్వీకరణ ప్రారంభం  13 అక్టోబర్ 

చివరి తేదీ  15  అక్టోబర్ 

పరిశీలన  16 అక్టోబర్ 

ఉప సంహరణ  19 అక్టోబర్ 

పోలింగ్  29 అక్టోబర్