calender_icon.png 24 October, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బదిలీపై వెళ్తున్న బ్యాంక్ అధికారికి ఘన సన్మానం

24-10-2025 05:19:40 PM

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని పాత బస్టాండ్ యూనియన్ బ్యాంకులో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ గా విధులు నిర్వహిస్తూ బదిలీ పై వెళ్తున్న కటకం రాజు ను ఘనంగా సన్మానించారు. శుక్రవారం బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగదాంబ హీరో మోటార్స్ మేనేజర్ గుండె బోయిన రాకేష్ యాదవ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ వాసాల సాగర్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఎంఓ శరత్, పెరుగు వెంకటేష్, పాత బస్టాండ్ చర్చ్ ఫాదర్ జూపాక సాల్మన్ లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకు కు వచ్చే ప్రతి ఖాతాదారున్ని సొంత కుటుంబ సభ్యునిగా ఆదరించి ఖాతాదారుల సమస్యలను త్వరగా పరిష్కరించి ఆపద్బాంధవుడు అయ్యాడన్నారు.  బ్యాంకు ను బదిలీ పై ప్రతి వెళ్లడం ఖాతాదారులకు  తీరని లోటని అన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలందించి భవిష్యత్తులో అత్యున్నత పదవులను అలంకరించాలని వారు ఆకాంక్షించారు.