24-10-2025 07:29:45 PM
హనుమకొండ,(విజయక్రాంతి): హోటల్ అశోక ఎదురుగా పాత మున్సిపాలిటీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన టిబెటియన్ ఉలెన్ స్వెటర్ మార్కెట్ ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... టిబెటియన్ ఉలెన్ స్వెటర్ మార్కెట్ వరంగల్ నగరంలో ప్రతి సంవత్సరం శీతాకాలంలో ప్రజలకు మంచి నాణ్యత గల ఉలెన్ దుస్తులను అందిస్తూ ఒక ప్రత్యేక ఆకర్షణగా మారిందని తెలిపారు. టిబెటియన్ వ్యాపారులు దశాబ్దాలుగా వరంగల్ ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నారని, వారి ఉత్పత్తులు నాణ్యత, నమ్మకం కలగలిపినవిగా ఉన్నాయని అన్నారు.అలాగే స్థానిక ప్రజలు చిన్న వ్యాపారులను, హస్తకళాకారులను ప్రోత్సహించాలని ఆయన సూచించారు.