24-10-2025 05:23:09 PM
నిర్మల్,(విజయక్రాంతి): హైదరాబాదులో గో సంరక్షకులకుపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షులు విట్టల్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ కు అందజేశారు. ప్రభుత్వ వైఫల్యం తోని ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం వెంటనే కఠినంగా వివరించాలని వారు డిమాండ్ చేశారు