01-05-2025 12:12:44 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 30 (విజయ క్రాంతి): సుదీర్ఘకాలం పోలీసు శాఖలో సేవలందించి పదవి విరమణ పొందిన ఐదుగురు పోలీసులను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఘనంగా సత్కరించారు. ఏ ఎస్ ఐ లు భూక్య కిషన్, సోమ కుమారస్వామి, మహమ్మద్ అహ్మద్, పెద్దిరెడ్డి రమేష్, హెడ్ కానిస్టేబుల్ స్వర్ణపాక పాపయ్య బుధవారం పదవి విరమణ చేయగా వారిని జిల్లా పోలీసు శాఖ తరపున శాలువాలు మేమెంటో తో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు భద్రత కల్పిస్తూ, అంకితభావంగా సేవలందించిన వారిని ప్రజలు ఎప్పుడు గుర్తించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు తిరుపతిరావు, గండ్రతి మోహన్, విజయ్ ప్రతాప్, సిఐ లు నరేందర్, సర్వయ్య, సత్యనారాయణ, ఆర్ ఐలు నాగేశ్వరరావు అనిల్ పాల్గొన్నారు.