01-05-2025 12:12:58 AM
బజార్హత్నూర్, ఏప్రిల్ 30 (విజయ క్రాం తి): మండలంలోని దేగామ గ్రామ శివారులో దాదాపు 14 ఎకరాలోని జొన్న పంట పొలాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. 8 మంది రైతుల పొలంలోని జొన్న పంటకు బుధవారం అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగి నిప్పు అంటుకోవడంతో పంట పూర్తి గా కాలి బూడిదయ్యింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జీ ఆడే గజేందర్ దగ్దమైన జొన్న పంటను పరిశీలించారు.
ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే రెవెన్యూ అధికారులతో మాట్లాడి సంఘటన స్థలానికి పిలిచి పంట వివరాలను నమోదు చేయించారు. రైతుల సమక్షంలో జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన ఆడే గజేందర్ రైతులకు ప్రభుత్వం తరఫున న్యాయం చేసే విధంగా చూస్తానని భరోసా కల్పించారు. అదే విధంగా జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జల్కే పాండు రం రంగ్, పలువురు నాయకులు ఉన్నారు.