21 May, 2026 | 4:38 PM

రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలో మెడల్స్ సాధించిన క్రీడాకారిణిలకు సన్మానం..

21-05-2026 03:37 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఇద్దరు అథ్లెటిక్ క్రీడాకారణిలు రాష్ట్రస్థాయిలో తమ ప్రతిభ పాటలను చాటారు. ఈనెల మే 10 తారీకు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం హనుమకొండ వేదికగా జరిగిన  తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ జంప్స్ త్రోస్ 400 మీటర్ రన్స్ క్రీడా పోటీలలో అథ్లెట్స్ 16 సంవత్సరాల బాలికల విభాగంలో కే సహస్ర లాంగ్ జంప్ లో 3:36 మీటర్లు దూకి కాంస్య పథకం, 20 సంవత్సరాల బాలికల విభాగంలో కె వర్షిని  3:75 మీటర్లు దూకి గోల్డ్ మెడల్స్ సాధించింది. బెల్లంపల్లి అథ్లెటిక్స్ క్రీడాకారులను, కోచ్ సల్పాల సంతోష్ ను తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి అభినందించారు. క్రీడాకారులకు భవిష్యత్తులో క్రీడా పరికరాలు, తోచిన సహాయం అందిస్తామనన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంటెవాడ నాగేష్ కుమార్, చిలుముల శంకర్, కజ్జం రమేష్, రత్నం ఐలయ్య,గెల్లీ జయరాం యాదవ్, ముత్తె వెంకట్ రాజం, సీనియర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.