30-09-2025 05:54:11 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): ఉత్సవ ఉపాధ్యాయులుగా ఎంపికై అవార్డులు తీసుకున్న సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సముద్రాల ప్రవీణ్ కుమార్, మరొకరు ముస్త్యాల స్వప్నలను పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య భవన్ లో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది. అలాగే పెద్దపెల్లి జిల్లా అవోపో యూనిట్ కార్యదర్శిగా సుల్తానాబాద్ కు చెందిన పల్లా సురేష్ ను, సుల్తానాబాద్ మండల అవోపో యూనిట్ అధ్యక్షులుగా ఎన్నికైన కొమురవెల్లి కాశీపతి, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రామిడి రవీందర్, కోశాధికారిగా ఎన్నికైన కొమురవెల్లి శ్రీనివాసులను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా షాల్వాల్ కప్పి సన్మానించి.. అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం లీడర్స్, మహిళా లీడర్స్ తో పాటు సభ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు.