30-09-2025 05:50:03 PM
నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలో రిటైర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పెన్షన్ ఆఫీసులో సామూహిక జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 9 మంది సభ్యులకు సన్మానం చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న అద్యక్షులు కందాళ పాపిరెడ్డి, కార్యదర్శి వీరమల్ల రవీందర్, గౌరవ అధ్యక్షుడు వంటల రామలింగం, ముఖ్య సలహాదారు కందుల సోమయ్య, సీనియర్ పెన్షనర్లు గింజల నరసింహారెడ్డి, తునుపునూరి కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.