calender_icon.png 28 January, 2026 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

24 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్

24-10-2024 01:05:02 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (విజయక్రాంతి): నగరంలోని పలు ప్రాంతా ల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుంది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లు ఫేజ్ 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ పైపుకు లీకేజీ ఏర్పడగా, గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 వరకు మరమ్మతులు చేపట్టనున్నారు.

దీంతో శాస్త్రిపురం, బండ్లగూడ, భోజగుట్ట, షేక్‌పేట్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, ప్రశాసన్‌నగర్, తట్టిఖానా, లాలాపేట్, సాహెబ్‌నగర్, ఆటోనగర్, సరూర్‌నగర్, వాసవి రిజర్వాయర్లు, సైనిక్ పురి, మౌలాలి, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్,  దేవేంద్రనగర్, మధుబన్, దుర్గానగర్, బుద్వేల్, సులేమన్‌నగర్, గోల్డెన్ హైట్స్, బోడుప్పల్, మల్లికార్జున నగర్, మాణిక్‌చంద్, చెంగిచెర్ల, భరత్‌నగర్, పీర్జాదిగూడ, పెద్ద అంబర్‌పేట్ ప్రాంతాలకు సరఫరా నిలిచిపోనుంది.