calender_icon.png 28 January, 2026 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజిత్ పవార్ మరణంపై బెంగాల్ సీఎం కీలక వ్యాఖ్యలు

28-01-2026 04:04:05 PM

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణం పట్ల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ మృతిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని మమత డిమాండ్ చేశారు. దేశంలో రాజకీయ నేతలకు కూడా భద్రత లేదని ఆమె ఆరోపించారు. అజిత్ పవార్ బీజేపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసిందన్నారు. 

అజిత్ పవార్ బీజేపీని వీడతారని వేరే పార్టీ నేత అన్నట్లు తెలిసిందని చెప్పారు. అజిత్ పవార్ త్వరలోనే సొంతగూటికి చేరుకోవచ్చని తెలిసిందని వెల్లడించారు. ఇంతలోనే అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలన్నారు. సుప్రీంకోర్టు మినహా ఇతర ఏ దర్యాప్తు సంస్థలపై తమకు నమ్మకం లేదని తెలిపారు. అన్ని కేంద్ర సంస్థలు పూర్తిగా బీజేపీతో రాజీపడిపోయాయని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్(66) మరణించిన విషయం తెలిసిందే.