22-10-2025 12:47:44 AM
వలిగొండ, అక్టోబర్ 21: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం వలిగొండ మండలంలోని మాందాపూర్ గ్రామంలో ఇందిరమ్మ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని సకాలంలో లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ, ఎంఆర్‌ఐ కరుణాకర్‌రెడ్డి, పంచాయితీ కార్యదర్శులు నవీన్ రెడ్డి, లింగస్వామి పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలకు తీసుకురండి
వలిగొండ, అక్టోబర్ 21 (విజయక్రాంతి): రైతులు తాము పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం వలిగొండ మండలంలోని మాందాపురం, నాతాళ్ల గూడెం గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని మధ్య దళారులకు అన్ని మోసపోవద్దని అన్నారు. రైతులు తమ ధాన్యాన్ని 17% తేమ ఉండేలా తాలు, మట్టి లేకుండా చూసుకోవాలని ఏఈవోలు నాణ్యత ప్రమాణాలు పాటిస్తే మిల్లర్లు ఇబ్బంది పెట్టారని అన్నారు.
రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలైన టెంట్ మరియు వాటర్ సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు. రానున్న రోజులలో ప్రభుత్వ స్థలాలు గుర్తించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులు విశ్రాంతి తీసుకునేందుకు భవనాలు నిర్మించేందుకై ప్రభుత్వానికి సిఫారసులు పంపించడం జరిగిందని జిల్లాలో 98 ప్రభుత్వ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. రైతులు తమ ధాన్యం తడవకుండా కాపాడుకుంటున్నారని కానీ రైతులు కూడా తడవకుండా ఉండేందుకు రైతుల కోసం విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కొనుగోలు ప్రారంభమైన వెంటనే మిల్లర్లు ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తీసుకునేందుకు సహకరిస్తామని తెలియజేయడం జరిగిందని హమాలీలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగిందని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ, ఏఈఓ అంజనీ దేవి, ఎంఆర్‌ఐ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్లు మెరుగైన వైద్యాన్ని అందించాలి
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు సెంటర్ లోనే అమ్ముకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం రామన్నపేట మండలం తుమ్మ లగూడెం గ్రామంలో మునిపంపుల ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ఉప కేంద్రంలో ఎంత మంది సిబ్బంది విధులకు హాజరు అయ్యారని. ప్రతి రోజు వస్తున్నారా లేదా అని రిజిస్టర్ పరిశీలించారు.రోజు ఓపి కి ఎంత మంది వస్తున్నారని. ఏ రోగాలతో వస్తున్నారని. మెడిసిన్స్ అన్ని ఉన్నాయా అని సంబంధిత అధికారులు అడగడం జరిగింది.
గత నెలలలో ఎన్ని ఈ డి డి లు ఉన్నాయి. ఈ నెలలో ఎన్ని ఉన్నాయి. ఇప్పటి వరకు అయినవి అన్ని ఎక్కడ డెలివరీ జరిగాయి అని అడిగి తెలుకున్నారు. అనంతరం రామన్నపేట భోగారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. తేమ శాతాన్ని పరిశీలించారు.రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవడానికి వీలు లేదని అన్నారు. ఏ రోజు వచ్చిన ధాన్యం ఆ రోజు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని వాటి వివరాలను రిజిస్టర్,ట్యాబ్ లో నమోదు చేయాలన్నారు. అనంతరం రామన్నపేట మండలం లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.. గ్రామంలో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ నిర్మాణ పనులు ఎంత మేరకు జరుగుతున్నాయని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల ను త్వరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.