22-10-2025 12:49:35 AM
- పట్టణ సౌందర్యానికి శిల్పీలు మున్సిపల్ కార్మికులే..
- ఉద్యమ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్
చిట్యాల, అక్టోబర్ 21(విజయ క్రాంతి): తెలంగాణ సంస్కృతి, ఆతిధ్య పరంపరకు ప్రతీక గా నిలిచే “అలాయ్ బలాయ్ ” కార్యక్రమంలో భాగంగా మంగళవారం మున్సిపల్ కార్మికులతో నిర్వహించామని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ర్ట అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ అన్నారు. ఆయన నివాసంలో సతీమణి కూనూరు సాత్విక గౌడ్, కూతురు క్లింకార తో కలిసి 50 మంది మున్సిపల్ కార్మికులను గౌరవప్రదంగా శాలువాలతో సన్మానించారు.
కార్మికులకు నూతన దుస్తులు కోసం 25000 నగదు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దెశించి ఆయన మాట్లాడుతూ ఇది కేవలం సన్మానం మాత్రమే కాకుండా, రోజూ పట్టణ పరిశుభ్రత కోసం కష్టపడే వారి సేవను గుర్తిస్తూ కృతజ్ఞత తెలపడం అని అన్నారు. మున్సిపల్ కార్మికులు ప్రజారోగ్య రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్నా రని, వారి అహర్నిశల కృషిని గుర్తిస్తూ ఈ కార్యక్రమం ద్వారా “సేవకు గౌరవం గౌరవానికి గుర్తింపు” అని అన్నారు.
పట్టణ సౌందర్యానికి శిల్పీలు మున్సిపల్ కార్మికులే అని, వారి త్యాగం, కష్టం వల్లే ప్రజలకు శుభ్రమైన పరిసరాలు అందుతున్నాయి అని కార్మికుల సేవలను కొనియాడారు. అలయ్ - బలయ్ కేవలం సంస్కృతీ కార్యక్రమం కాదని, సామాజిక బాధ్యతకు ప్రతిబింబం అని అన్నారు.ఈ సందర్బంగా మున్సిపల్ కార్మిక సంఘ%ళి% రాష్ర్ట కార్య వర్గ సభ్యులు పాల లక్ష్మయ్య, జడల నర్సింహా యాదవ్ మాట్లడూతూ “మా శ్రమను గుర్తించినందుకు ఇది మా జీవితంలో మరపురాని రోజు అని అన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్ సాత్విక దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. మమ్మల్ని ఏ నాయకుడు గుర్తించలేదని ప్రతి సంవత్సరం గుర్తిస్తున్న ఏకేక నాయకుడు సంజయ్ దాస్ గౌడ్ మాత్రమే అని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.