24-09-2025 07:54:48 PM
తహసీల్దార్ సతీష్ కుమార్
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలో లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో లబ్ధిదారులు నివాసం ఉండకుంటే వారి ఇంటి పట్టాలను రద్దు చేస్తామని మండల తహసీల్దార్ పి సతీష్ కుమార్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
పట్టణంలో నిర్మించిన 560 డబుల్ బెడ్ రూం ఇళ్లకు గాను 243 మంది అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి గత సంవత్సరము పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. కేటాయించిన ఇండ్లలో లబ్ధిదారులు నివాసం ఉండటం లేదని సమాచారం ఉందని, లబ్ధిదారులు వారం రోజులలో వారికి కేటాయించిన ఇండ్లలో నివాసము ఉండ కుంటే వారికి జారీ చేయబడిన పట్టా సర్టిఫికెట్లను ప్రభుత్వ నిబంధనల ప్రకారము రద్దుచేసి గతంలో దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారిని గుర్తించి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించడం జరుగు తుందని ఆయన స్పష్టం చేశారు.