24-09-2025 07:51:45 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా దినోత్సవం రోజును పురస్కరించుకొని బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ నరసయ్య మాట్లాడుతూ భారతదేశంలోనే పూలను పూజించే పండుగ మన తెలంగాణ సంస్కృతిలో ఉన్నదని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరని, మన సంస్కృతిని సంప్రదాయాలను కొనసాగిస్తూ ఆడపిల్లలు బతుకమ్మ సంబరాలు ఘనంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. జాతీయ సేవా పథకం రోజున పురస్కరించుకొని మా కోసం కాదు మీకోసం అనే నినాదంతో ఈ సేవా భావంతో కార్యక్రమాలు చేయాల్సిందిగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత మానవ సేవా దృక్పథం అలవర్చుకోవాలని అన్నారు.