calender_icon.png 24 September, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు కాటారంలో మంత్రి పర్యటన

24-09-2025 07:59:25 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో గురువారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొననున్నారు. కాటారం మండల కేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్ లో కాటారం, మహా ముత్తారం, పలిమెల, మహదేవపూర్, మలహర్రావు, మండలాల గ్రామాలకు సంబంధించిన 300 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు  ఇవ్వనున్నారు. ఈ ఐదు మండలాలకు సంబంధించిన 50 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను, 90 కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పోషణ్ మహా మాసం అంగన్వాడీ లబ్ధిదారులు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా గ్రంథాలయా చైర్మన్ కోట రాజబాబు తెలిపారు.