calender_icon.png 13 May, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేయి స్తంభాల దేవాలయం, వరంగల్ ఫోర్ట్ ను సందర్శించనున్న సుందరీమణులు

12-05-2025 10:33:43 PM

వేయి స్తంబాల దేవాలయం, వరంగల్ ఫోర్ట్ ను సందర్శించనున్న సుందరీమణులు

హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ షో బోట్, వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సూచనలు చేసిన కలెక్టర్లు, పోలీస్ కమిషనర్

హనుమకొండ,(విజయక్రాంతి): హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు ఈ నెల 14వ తేదీన(బుధవారం) వరంగల్ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. 14వ తేదీన హనుమకొండలోని హరిత కాకతీయ చేరుకుని అక్కడి నుండి వేయి స్తంభాల దేవాలయం, వరంగల్ లోని ఖిలా వరంగల్ కోటను వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు సందర్శించనున్న నేపథ్యంలో సోమవారం హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, వరంగల్ పోలీస్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ షో బోట్ ప్రతినిధులు ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలించి సమర్ధ నిర్వహణకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా హరిత కాకతీయ, వేయి స్తంభాల దేవాలయం, ఖిలా వరంగల్ వద్ద చేస్తున్న ఏర్పాట్లను ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ షో బోట్, పర్యాటక శాఖ, సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుందరిమణులు సందర్శించే  మూడు చోట్ల ఎంట్రీ,ఎగ్జిట్ పాయింట్లు, దర్శనీయ ప్రదేశాలు, పోలీస్ బందోబస్తు, వేయి స్తంభాల దేవాలయం, ఫోర్ట్ వరంగల్ వద్ద ఏర్పాటు చేయనున్న సౌండ్ అండ్ లైట్, ఫ్లియా మార్కెట్, సాంస్కృతిక ప్రదర్శనలు, మీడియా పాయింట్ల గురించి కలెక్టర్లు, కమిషనర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సంస్థ ప్రతినిధులు అధికారులతో చర్చించారు. మూడు చోట్ల  పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలని, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా  అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, కమిషనర్ అధికారులకు సూచించారు. హైదరాబాదు నుండి ఈనెల 14వ తేదీన సాయంత్రం 4:35 గంటల హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ కు వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు చేరుకుంటారు.

హోటల్ హరిత నుండి బయలుదేరి సాయంత్రం 5:45 గంటలకు చారిత్రక వేయి స్తంభాల దేవాలయానికి చేరుకుని అక్కడి కార్యక్రమాల అనంతరం సాయంత్రం 6:25 గంటలకు బయలుదేరి 6:40 వరంగల్ ఫోర్ట్ కు చేరుకొని అక్కడి విశిష్టతలను సందర్శించి తెలుసుకుంటారని పేర్కొన్నారు. అక్కడి కార్యక్రమాల అనంతరం 7:35 గంటలకు బయలుదేరి 7:55 గంటలకు హరిత కాకతీయ హోటల్ కు చేరుకుంటారని పేర్కొన్నారు. హరిత కాకతీయలో డిన్నర్ అనంతరం రాత్రి 9 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వై వి గణేష్, పోలీస్ అధికారులు, సంభందిత జిల్లా అధికారులు, పర్యాటక, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ షో బోట్ ప్రతినిధులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.