03-02-2026 01:07:42 AM
నిర్మల్, ఫిబ్రవరి ౨ (విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలంలోని ముజిగి మల్లన్న స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి పురస్కరించుకొని నిర్వహిస్తున్న జాతర వైభవంగా కొనసాగుతోంది. సోమవారం ఆలయంలో రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించగా లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి రథోత్సవాలు తిలకించారు. అంతకుముందు ఆలయంలో యాదవ సోదరులు సంప్రదాయ పద్ధతిలో మల్లన్న స్వామికి పసుపు గొర్రె పిల్లలు బెల్లం మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ జాతరకు నిర్మల్ అదిలాబాద్ మంచిర్యాల మహారాష్ట్ర నిజాంబాద్ జగిత్యాల హైదరాబాద్ రైతుల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఆలయా న్ని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, భోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎస్పీ జానకి షర్మిలతోపాటు ప్రముఖులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మల్లేష్ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.