28-01-2026 12:00:00 AM
ఆదిలాబాద్/ ఉట్నూర్, జనవ రి 27 (విజయక్రాంతి): బిల్లుల మంజూరులో అవినీతికి పాల్పడుతున్న అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో గృహ నిర్మాణ శాఖలో ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న దుర్గం శ్రీకాంత్... మండల కేంద్రంలోని ఓ గిరిజన లబ్ధిదారునికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. ఇంటి నిర్మాణంలో రూప్ లెవెల్ వరకు బిల్లు ఇవ్వాలని ఇంటి లబ్ధిదారులు సదరు అధికారులను కోరారు. బిల్లు మంజూరుకు రూ.20 వేలు ఇవ్వాలని ఏఈ శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
తన వద్ద ఇంత డబ్బు లేదని, చివరకు రూ.10 వేలు కు అధికారి ఒప్పుకున్నాడు. అయితే ఆ పది వేలు సైతం తన వద్ద లేకపోవడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో లబ్ధిదారు నుంచి రూ. 10 వేల లంచం తీసు కుంటుండగా ఏఈ శ్రీకాం త్‌ను ఏసీబీ డీఎస్పీ మధు తన సిబ్బందితో కలిసి రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితున్ని కరీంనగర్ లోని ప్రత్యేక కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు.