ఎలా ఉన్నారు? బాగా చదువుకుంటున్నారా?
- పెద్దయ్యాక ఏం అవుదాం అనుకుంటున్నారు? మీ భోజనం బాగుంటుందా?
- భోజనం చేద్దామా? మెనూ ఫ్లెక్సీ ఎక్కడ పెట్టారు?
- వైరా గరల్స్ రెసిడెన్షియల్ విద్యార్థినీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
- వైరా రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆకస్మికంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి
- విద్యార్థినీలతో ప్రత్యేకంగా సమావేశం... భోజనం చేసిన డిప్యూటీ సీఎం
- బోధన తీరు, వసతులు, మెస్ నిర్వహణ, మెనూ మెయింటినెన్స్ పై విద్యార్థినీలతో ముచ్చటించిన డిప్యూటీ సీఎం
ఖమ్మం, ఏప్రిల్ 6 ( విజయక్రాంతి ):- ఆదివారం భద్రాచల శ్రీ సీతారామస్వామి కళ్యాణానికి హాజరై తిరుగు ప్రయాణంలో సాయంత్రం సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకస్మికంగా వైరా మండల కేంద్రంలోని మహిళా రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించారు.
మొదట విద్యార్థినిల అందరితో స్థానిక ఎమ్మెల్యే రాం దాస్ నాయక్ తో కలిసి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సుమారు 500 మంది విద్యార్థినీలతో వారు సమావేశం అయ్యారు. రాత్రివేళ హాస్టల్లో డ్యూటీలో ఎవరు ఉం టారు? వారు ఎక్కడ పడుకుంటారు? డిన్న ర్ టైమింగ్స్ ఏంటి? ఇప్పుడు భోజనం చేద్దామా? హాస్టల్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అంటూ విద్యార్థినీల నుంచి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంటర్ వర కు ఉంది కదా? రిజలట్స్ ఎలా వస్తున్నా యి? ఇంటర్ పూర్తి చేసిన వారు ఎటువైపు వెళుతున్నారు? మెడిసిన్ వైపు ఎంతమంది వెళ్లారు? ఇంజనీరింగ్ సైడ్ ఎంత మంది వెళ్లారు అని సిబ్బందిని ప్రశ్నించారు. ఈ సంవత్సరం నలుగురు మెడిసిన్ కు ఎంపికైనట్టు సిబ్బంది వివరించారు. మిగిలినవారు ఇంజనీరింగ్ వైపు వెళ్లినట్టు తెలిపారు.
మీ కళాశాల నుంచి బయటికి వెళ్లిన విద్యార్థుల వివరాలు నమోదు చేస్తున్నారా? విద్యార్థినిల సంఖ్యకు అనుగుణంగా క్లాస్ రూమ్స్ ఉన్నా యా? ప్రతి క్లాస్కు ఎన్ని సెక్షన్లు ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు.విద్యార్థినీలతో భోజనం చేసిన డిప్యూటీ సీఎం విద్యార్థినీలతో పాఠశాల ఆవరణలో ప్రత్యేకంగా సమావేశం అయిన తర్వాత. డిన్నర్ రెడీగా ఉందా? అంతా కలిసి భోజనం చేద్దాం, పదండి అంటూ పిల్లలను వెంటపెట్టుకొని డిప్యూటీ సీఎం భోజనం చేశారు.
మెనూ పాటిస్తున్నారా?
భోజనాల్లో నాణ్యత ఎలా ఉంటుంది. ఈరోజు మెనూ ఏమిటి? మీకు తెలుసా? మెనూ పాటిస్తున్నా రా అం టూ విద్యార్థినీలను ప్రశ్నించారు. భోజనం నాణ్యత బాగుంటుంది, మెనూ పాటిస్తున్నారంటూ విద్యార్థిని సమాధానం ఇచ్చారు. మెనూ ఫ్లెక్సీ ఎక్కడ పెట్టారు అం టూ ఆరా తీసి, ఫ్లెక్సీ దగ్గరకు వెళ్లి మెనూ చార్ట్ ను పరిశీలించారు. వసతులు, ఇబ్బందుల గురించి టీచింగ్ స్టాఫ్ ను అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది స్టాఫ్ ఉండాలి? ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు ఆకులను అడిగి తెలుసుకున్నారు.






