calender_icon.png 7 September, 2025 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంకెన్నాళ్లు బీఆర్‌ఎస్‌కు దోచిపెడతారు?

05-09-2025 01:47:06 AM

  1. ఒక్కో కటింగ్ మిషన్ షాపు నుండి సభ్యత్వం పేరుతో రూ.10 నుండి రూ.50 లక్షలు వసూలు చేశారు?

వసూలు చేసిన పైసల లెక్కలన్నీ తీస్తా

స్వేచ్చగా వ్యాపారం చేసే పరిస్థితిని నేను కల్పిస్తా.. సమాజానికి సేవ చేయండి

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, సెప్టెంబరు 4 (విజయ క్రాంతి): 20 ఏళ్లుగా గ్రానైట్ వ్యాపారులం తా బీఆర్‌ఎస్ కు దోచిపెడుతూనే ఉన్నారని, ఇంకెన్నాళ్లు దోచిపెడతారని ప్రశ్నించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని గ్రానైట్ అసోషియేషన్ నాయకులకు ఝలక్ ఇచ్చారు. గురు వారం గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మా నకొండూరు చెరువు వద్దకు వచ్చారు.

అక్కడ గ్రానైట్ అసోసియేషన్ నాయకులు తిరుపతి గౌడ్ తోపాటు మరికొందరు నాయకులు ఎ దురుపడ్డారు. ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లాచ్చాక వ్యాపార సంబంధాలు మె రుగుపడ్డాయని, గ్రానైట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని గ్రానైట్ అసోసి యేషన్ నేతలు చెప్పారు. ఆ వెంటనే సంజ య్ స్పందిస్తూ “మరి కనీసం ప్రెస్ మీట్ పెట్టి మోదీకి థ్యాంక్స్ అయినా చెప్పారా? ఎందుకు చెప్పలేదు? గత 20 ఏళ్లుగా మీరం తా బీఆర్‌ఎస్ కు దోచిపెడుతూనే ఉన్నారు.

మీలో కొందరు వ్యాపారాల కోసం రాజకీయాలను వాడుకుంటున్నరు. కొందరు రాజ కీయ నాయకులై వ్యాపారాలను పెంచుకుంటరు. వచ్చిన సొమ్ముతో రాజకీయాలు చేస్తా రు. మాలోంటోళ్లను ఓడగొట్టాలని చూస్తరు‘ అని చురకలంటించారు. గ్రానైట్ అసోసియేషన్ నుండి బండి సంజయ్ కోట్ల రూపాయ ల లంచం తీసుకున్నాడంటూ గతంలో జరిగిన దుష్ప్రచారాన్ని సంజయ్ వారి వద్ద ప్ర స్తావించారు.

“ఏనాడైనా మీరు నాకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? నేను గెలిచిన తరువాత కూడా మీలో ఒక్కరైనా నా దగ్గరకు వచ్చి కనీసం బొకే అయినా ఇచ్చారా? ఒక్క స్వీటు ముక్క కూడా తిన్పించలేదు కదా, కానీ బయట మాత్రం కొందరు నాకు 700 కోట్ల రూపాయలు ఇచ్చానని నిందలేస్తుంటే మీ అసోసియేషన్ కనీసం ఖండిం చలేదు, పైగా వందల కోట్ల రూపాయలను బీఆర్‌ఎస్ కు దోచి పెట్టి ఆ పార్టీని ఇంకా సాదుతున్నరు, సమాజానికి సేవ చేయాలనే ఆలోచన మాత్రం మీకు రావడం లేదు.”అని వ్యాఖ్యానించారు.

ఆ తరువాత అక్కడి నుం డి చింతకుంట చెరువు వద్దకు వచ్చి గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతుండగా మల్లిఖార్జున మధుతో కలిసి కొందరు గ్రానైట్ వ్యాపారులు అక్కడిక వ చ్చారు. మళ్లీ వాళ్లను ఉద్దేశించి “గ్రానైట్ అ సోసియేషన్ కేంద్రానికి చెల్లించింది 300 కోట్ల రూపాయలకు మించి లేదని, బయటకు పోయి మాత్రం వెయ్యి కోట్లు ఇచ్చిన ట్లు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు.

గ్రానైట్ కటింగ్ మిషన్ దుకాణాల నుండి స భ్యత్వం పేరుతో ఒక్కో దుకాణం నుండి రూ. 10 లక్షల నుండి రూ.50 లక్షల దాకా గ్రానై ట్ అసోసియేషన్ వసూలు చేసిందని, దా దాపు 350 నుండి 500 షాపుల దాకా డ బ్బులు వసూలు చేసినట్లు సమాచారం ఉం దన్నారు. మరి ఆ సొమ్మును ఏం చేశా రు? సమాజానికి ఏమైనా సేవ చేశారా? గ ణేశ్ పండుగ సందర్భంగా గల్లీగల్లీలో గణేష్ మం డపాలు పెడతారు, కనీసం తట్టెడు మట్టి పో శారా? కరెంట్ బిల్లులైనా కట్టారా? అధికారులు, పోలీసులు సొంతంగా ఖర్చు పె ట్టుకు ని తిండి తింటూ రాత్రింబవళ్లు డ్యూటీ చేస్తా రు.

అట్లాంటి వాళ్లకు భోజన, మంచి నీళ్ల సదుపాయాలైనా కల్పించారా? అవేమీ చేయరని అన్నారు. మరి వసూలు చేసిన కోట్ల రూపాయలను ఏం చేశారు? తీస్తా... ఆ లె క్కలన్నీ త్వరలోనే బయటకు తీస్తా...”అని అన్నారు. దీంతో ఖంగుతిన్న దీంతో ఖంగుతిన్న గ్రానైట్ అసొసియేషన్ నాయకులు స మాజానికి సేవ చేస్తామని అందులో భాగంగానే గణేష్ నిమజ్జనం సందర్భంగా క్రేన్లను ఏర్పాటు చేశామని చెప్పారు.

త్వరలోనే మో దీకి సైతం థ్యాంక్స్ చెబుతామని, గ్రానైట్ అ సోసియేషన్ పేరుతో సమాజానికి సేవా కా ర్యక్రమాలు చేస్తామని చెప్పారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ ఎవ్వరికీ పైసలు ఇ వ్వాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛగా వ్యా పారం చేసుకునే పరిస్థితిని కల్పిస్తానని, సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు చేయాలనిసూచించారు.