05-09-2025 01:44:37 AM
ప్రశాంతంగా జరుపుకోవాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, సెప్టెంబర్ 4(విజయక్రాంతి): గణేష్ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మ ళ్లింపులు ఉంటాయి.మానకొండూర్ చెరువులో నిమజ్జనం ఉంటుంది కనుక హుజూ రాబాద్ నుంచి కరీంనగర్ వైపు వచ్చే వాహనాలు మానకొండూర్ పల్లె బస్టాండ్ వద్ద నుంచి ముంజంపల్లి, పోరండ్ల వైపు మళ్లిస్తా రు. ఆ తర్వాత తిమ్మాపూర్ వద్ద రాజీవ్ రో డ్డుకు చేరుకుని, అక్కడి నుంచి కరీంనగర్కు వెరుకుంటాయి.
నిమజ్జనం తర్వాత తిరిగి వె ళ్లే వాహనాలు కూడా ఇదే మార్గంలో అంటే ముంజంపల్లి, పోరండ్ల మీదుగా తిమ్మాపూ ర్కు చేరుకుని, అక్కడి నుంచి కరీంనగర్కు వెళ్లాలి. కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వై పు వెళ్లే వాహనాలకు ఎలాంటి మళ్లింపులు ఉండవు. అవి యథావిధిగా తమ మార్గంలో ప్రయాణించవచ్చు.కొత్తపల్లి మళ్లింపులో భా గంగా జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వచ్చే వాహనాలను వెలిచాల ఎక్స్ రోడ్డు వ ద్ద మల్కాపూర్, చింతకుంట, పద్మనగర్ ఎక్స్ రోడ్డు, ఎన్టీఆర్ విగ్రహం మీదుగా సిరిసిల్ల బైపాస్ రోడ్డు నుంచి కరీంనగర్ పట్టణానికి మళ్లిస్తారు.
అవసరమైతే కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్లే వాహనాలకు రేకుర్తి జం క్షన్ వద్ద యూనివర్సిటీ ఎక్స్ రోడ్డు, మల్కాపూర్ వైపు మళ్లించి, వెలిచల ఎక్స్ రోడ్డు వద్ద జగిత్యాల రోడ్డుకు చేరుకుంటారు. చింతకుం ట, కొత్తపల్లి: నిమజ్జనం తర్వాత, ఈ పా యింట్ల వద్దకు వచ్చిన వాహనాలు యూ ట ర్న్ తీసుకుని అదే మార్గంలో కరీంనగర్కు తి రిగి వెళ్లాలి. శుక్ర, శనివారాల్లో గ్రానైట్ ఇతర భారీ సరుకు రవాణా వాహనాలను అనుమతించరు.
ఈ నిబంధనలను తప్పక పాటిం చాలని పోలీస్ కమిషనర్ గౌస్ అలం కోరా రు. ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం జరపాలి - కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలకు తావివ్వకుండా ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనోత్సవాలను జరుపుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. శుక్రవారం ఉద యం నుండే గణేశ్ విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
భక్తిశ్రద్దలతో, క్రమశిక్షణతో హిందువులంతా ఐక్యంగా ఉంటూ గణేశ్ నిమజ్జనోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించడం ద్వారా సమాజానికి కరీంనగర్ నుండి స్పూర్తిదాయకమైన సందేశం పంపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరీంనగర్ లో గణేశ్ నిమజ్జన ఉత్సవాల నే పథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మానకొండూరు చెరువును సందర్శించారు.
మాజీ మేయర్ సునీల్ రావు, రెవిన్యూ, పో లీసు అధికారులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. గణేశ్ విగ్రహాలను తరలించే సమయంలో కరెంట్ వైర్లు, చెట్లు అడ్డు లేకుండా తొలగిస్తున్నారు. పోలీసులు ఎవరినీ ఇబ్బంది పెట్టరు. ఎక్కడైనా ఇబ్బంది కలిగితే వెంటనే అధికారుల ద్రుష్టికి తీసుకురావాలే తప్ప దయచేసి తప్పుడు సమా చారం ఎవ రూ నమ్మవద్దనికోరారు.