08-08-2025 12:00:00 AM
డాక్టర్ విజయభాస్కర్ :
తెలంగాణవ్యాప్తంగా ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులను కొందరు పనిగట్టుకుని అడ్డుకోవడం సమంజసమేనా? రాష్ట్ర ప్రభుత్వం ప్రభు త్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యా యులు, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులు ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ అయినప్పటికీ, వాటిని ఆపేందుకు కొందరు, కొన్ని రకాల ప్రయత్నాలు చేయడం ఆవేదన కలిగించే విషయం.
ఆందోళనకరమైన విషయం. రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు బదిలీల తర్వాతే పదోన్నతులు ఇవ్వాలని కొందరు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమైన హైకోర్టును ఆశ్రయించారు. బదిలీలు, పదోన్నతులు వేర్వే రు విషయాలని, పదోన్నతులను అడ్డుకోవడం తగదని, పదోన్నతులు యథావిధిగా జరుపుకోవచ్చని పేర్కొంటూ.. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
ఆ తర్వాత, 2002 డీఎస్సీ ఉపాధ్యాయుల సీనియారిటీని సక్రమంగా పాటించలేదనే సాకుతో తెలంగాణ ఉన్నత న్యాయస్థానమైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. ఈ పదోన్నతుల కేసు ఆగస్టు 11న విచారణకు రానున్నది. పదోన్నతులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారికే అవకాశం ఇవ్వాలని కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు.
2024 పదోన్నతుల సమయంలో టెట్ ఉత్తీర్ణత గురించి కొందరు హైకోర్టును ఆశ్రయిస్తే, 2014 కంటే ముందు ఉపాధ్యాయులుగా చేరినవారికి టెట్ పరీక్ష ఉత్తీర్ణత నిబంధన వర్తించదని న్యాయస్థానం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం ఎన్‌సీటీఈకి లేఖ రాసింది. లేఖపై అక్కడి నుంచి కూడా స్పం దన వచ్చింది. 2024లో టెట్ ఉత్తీర్ణత లేనివారికి, భాషోపాధ్యాయులకు, పీఈటీలకు పదోన్నతులు వచ్చాయి.
2025లో తెలంగాణ ప్రభుత్వం సర్కార్ బడులను బలోపే తం చేయడానికి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని భావించగానే, మళ్లీ టెట్ ఉత్తీర్ణత ప్రస్తావన తెచ్చి.. మళ్లీ కొం దరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో టెట్ సంబంధిత కేసు ఆగస్టు 13వ తేదీకి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల పదోన్నతుల వ్యవహారం తాత్కాలికమా? లేదా వాయిదాలతోనే సరిపోతుందా? అని రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్రప్రభుత్వం చొరవ..
గత ప్రభుత్వం పది సంవత్సరాలు పదోన్నతులు, బదిలీలు చేయకుండా.. ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలలను నిర్వీర్యం చేసింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సర్కార్ విద్యకు ప్రాధా న్యం ఇస్తున్దని. విద్యాశాఖలో ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతున్నది. తెలంగాణలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 2024లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయిం ది.
కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకురావడానికి కాంగ్రెస్ సర్కార్ పిల్లలకు కంప్యూట ర్ విద్య అందిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఉచితంగా కరెంటు సౌక ర్యం కల్పిస్తున్నది. ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం ఇచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలోనూ ఎప్పుడూ లేని విధంగా విద్యార్థులకు వేసవి సెలవుల్లోనే ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్కులు, యూనిఫాంలు అందాయి. ‘అమ్మ ఆదర్శ పాఠశా ల’ పేరుతో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలలన్నింటికీ పూర్వవైభవం తెచ్చేందుకు ప్రణాళికలు అమలవుతున్నాయి.
పాత భవనాలకు మరమ్మతులు జరుగుతున్నాయి. ప్రతి పాఠశాలలో విద్యాశాఖ మంచినీటి, మరుగుదొడ్లు, మూత్రశాలలను ఏర్పాటు చేస్తు న్నది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లు నిర్మించాలనే సంకల్పం తీసుకున్నది. సర్కార్ బడుల్లో విద్యా ప్రమాణాలు అమలు చేస్తున్నది.
పిటిషన్ల మీద పిటిషన్లు..
రెండు, మూడు దశాబ్దాలుగా ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తూ ప్రాథమిక పాఠశాల వేతనాలు తీసుకుంటున్న భాషోపా ధ్యాయులు (తెలుగు, హిందీ, ఉర్దూ, కన్న డ, మరాఠీ మొదలైన దేశీయ ఉపాధ్యాయులు) పదోన్నతులు లేక ఏ హోదాలో ఉద్యోగంలో చేరారో అదే హోదాలో పదవీ విరమణ చేసినవారు అనేకమంది ఉన్నారు.
రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న భాషో పాధ్యాయుల న్యాయమైన కోరికైన స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు ఇవ్వాలని, అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడి రాష్ర్ట ముఖ్యమంత్రులను, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి, ఆర్థికశాఖ మం త్రి, పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను, విద్యాశాఖ కార్యదర్శి, సంచాలకుడు, డైైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్‌ఈ)ను కలిసి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, కోర్టులో కేసు ఉన్నందున ఏమీ చేయలేమని ప్రభుత్వ పెద్దలు చేతులెత్తేశారు.
ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి శాసనమండలి ఎన్నికల సమయం లో భాషోపాధ్యాయులకు పదోన్నతులు ఇస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యా. ఆ వెంటనే ఎస్జీటీ ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల్లో తమకు అవకాశం ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశా రు.
తర్వాత న్యాయస్థానం స్టే తీసుకువచ్చింది. ఎన్నికలు ముగియగానే యథావి ధిగా భాషోపాధ్యాయుల పదోన్నతుల వ్యవహారం అటకెక్కడం షరామామూలైం ది. ఈ విధంగా నాలుగైదు సార్లు భాషోపాధ్యాయులకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కావడం, కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం గమనార్హం.
ఇప్పటికైనా పరిష్కారమయ్యేనా?
సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ వచ్చిన తర్వా త భాషోపాధ్యాయుల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేసి భాషోపాధ్యాయులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎస్జీటీ లు దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ అయింది. ప్రభుత్వం తలచుకుంటే సాధ్యం కానిదేమీ ఉండదని తెలంగాణకు చెందిన భాషోపాధ్యాయుల వ్యవహారం చక్కని ఉదాహరణగా నిలిచింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతు లు ఇవ్వడం వల్ల 10 వేలకు పైగా ప్రయోజనం కలిగించింది. భాషోపాధ్యాయులు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఉన్నత పాఠశాలల్లో పనిచేయడం వల్ల.. గతంలో సుప్రీం కోర్టులోనూ వారికి అనుకూలంగా ఉత్తర్వులు వస్తే, 1/2005 యాక్ట్ వచ్చింది.
రాష్ట్రప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ సర్కా ర్, 1/2005 యాక్ట్‌ను రద్దు చేసి నోషనల్ కింద పరిగణించి భాషోపాధ్యాయులకు న్యాయం చేయాలని రాష్ట్రంలోని భాషోపాధ్యాయులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. కోర్టు కేసులతో గత రెండు దశాబ్దాలుగా డైట్, బీఈడీ, తెలంగాణ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ), ఐఏఎస్‌ఈ వం టి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు, ఆచార్యుల పోస్టులు 2005 నుంచి ఖాళీగా ఉన్నాయి.
ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదోన్న తుల వ్యవహారం కోర్టులో నానుతున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ ఏర్పాటు కాలేదు. కామన్ సర్వీస్ రూల్స్ అమలు చేయడ మో, ప్రభుత్వ- పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు 50:50 నిష్పత్తి కేటాయించడ మో, లేదా ప్రభుత్వ, పంచాయతీరాజ్ వేర్వేరు మేనేజ్‌మెంట్లకు గతంలో ఏ విధమైన సర్వీస్ రూల్స్ ఉండేవో అదే విధంగా పదోన్నతులు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
చీటికిమాటికీ ఉపాధ్యాయులు కోర్టులకు వెళ్లడం, పదోన్నతులు అడ్డుకోవడం వలన సీనియర్ ఉపాధ్యాయులకు, ముఖ్యంగా పదవీ విరమణకు దగ్గరగా ఉన్నవారికి, ఎంఏ, ఎంఈడీ, పీహెచ్‌డీ, సెట్, నెట్ వంటి అన్ని విద్యార్హతలున్నా.. పదోన్నతులురాని ఉపాధ్యా యులకు అన్యాయం జరుగుతున్నది. రాష్ట్ర సర్కార్ వీలైనంత త్వరగా ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి, ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ఉపాధ్యాయులను నియమిస్తుందనే ఆశతో టీచర్లు ఎదురు చూస్తున్నారు.
వ్యాసకర్త సెల్: 9290826988