07-08-2025 11:31:01 PM
నేడు పాకాల యశోదారెడ్డి జయంతి :
తెలుగు సాహిత్యం.. ఆ మాటకొస్తే అచ్చమైన తెలంగాణ యాసలో అద్భుతమైన రచనలు చేసి, జన జీవితాన్ని ఆవిష్కరించిన అతి కొద్దిమంది రచయిత ల్లో డాక్టర్ పాకాల యశోదారెడ్డి ఒకరు. ఆమె విశిష్ట రచన ‘ఎచ్చమ్మ కథలు’ ఎప్పటికీ సాహితీరంగంలో ఎప్పటికీ చెరగని సంతకం తెలంగాణ మాండలికంలో కథలు రాసిన తొలి తరం తెలంగాణ రచయిత్రిగా ఆమె పేరు శాశ్వతంగా నిలిచిపోయింది.
ఆమె ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తొలి అధ్యక్షురాలిగా సేవలందించారు. ఆమె తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేశారు. తెలుగు సాహితీరంగంలో మేటి రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్నా రు. పరిశోధకురాలుగా, విమర్శకురాలిగా ఖ్యాతికెక్కారు. తెలంగాణ గ్రామీణ జీవితాలను ప్రతిబింబించేలా వాస్తవిక చిత్రణలో కథలు రాశారు. ఆమె కథలు తెలంగాణ గ్రామీణ జీవితాన్ని, అక్కడి మాండలికాన్ని, ఆచార వ్యవహారాలను యథాతథంగా చిత్రీకరించాయి.
ఆమె కథల్లోని పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. అవి మన చుట్టూ ఉన్న మనుషులను, మనస్తత్వాలను గుర్తుచేస్తాయి. ఆమె ఇప్పటి నాగర్‌క ర్నూల్ జిల్లా మహబూబ్‌నగర్ జిల్లాలోని బిజినేపల్లిలో 8 ఆగస్టు 1929 తేదీన కాశిరెడ్డి, సరస్వతమ్మ దంపతులకు జన్మించా రు. ఆమె తల్లి చిన్నతనంలోనే చనిపోయిం ది. ఆమెను బంధువులు చేరదీసి పెంచి, పెద్దచేశారు. విద్యాబుద్ధులు నేర్పించారు. చిన్నప్పటి నుంచే ఆమెకు చదువుపై మక్కు వ.
నాటి సమాజం ఆడపిల్లలకు విద్య ఎందుకు? అన్నట్లు ఉండేది. ఆడపిల్లలు ఇంటి నాలుగు గోడలకు పరిమితమై జీవించేవారు. ఇలాంటి పరిస్థితులను చూసి, యశోదారెడ్డిలో చదువుకోవాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. నాటి సంఘంలోని పరిస్థితులు అందుకు ప్రతికూలంగా ఉండేవి. ఇది గమనించిన రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ఆమెను హైదరాబాద్ నారాయణగూడలోని మాడపాటి బాలికల పాఠశాలలో చేర్పించారు.
ఆరోజు ల్లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయన.. చదువుపై ఆసక్తి ఉన్న ఆడపిల్లలు పట్టణంలో చదువుకునేందుకు వీలుగా ఒక వసతి గృహాన్ని సైతం ఏర్పాటు చేశారు. అలా యశోదారెడ్డి హైదరాబాద్‌లో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశారు. ఈ క్రమంలో ప్రత్యేక అనుమతితో విజయవాడలో ఆంధ్ర మెట్రిక్ పరీక్ష రాశా రు. గుంటూరు ఎసీ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, హైదరాబాద్ ఉమెన్స్ కాలేజీలో సెకండ్ ఇయర్ పూర్తి చేశారు.
సాహితీవేత్తలపై ప్రభావం..
కరీంనగర్ జిల్లా అన్నారానికి చెందిన చిత్రకారుడు పాకాల తిరుమలరెడ్డితో ఆమె వివాహం జరిగింది. వీరికి ఒక మగబిడ్డ కలుగగా, అనారోగ్య కారణాల వల్ల బిడ్డ పుట్టిన ఆరు నెలలకే మరణించాడు. యశోదారెడ్డి ఆ విషాదాన్ని తట్టుకోలేక పోయారు. అప్పటికీ ఇంటర్మీడియట్ వరకు చదివిన యశోదారెడ్డికి భర్త ప్రోత్సాహంతో ప్రైవేట్ గా డిగ్రీ చదివారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ (తెలుగు), ఎంఏ (సంస్కృతం) పూర్తి చేశారు.
తెలుగు సాహిత్యంలో పీహెచ్‌డీ పొం దారు. ఆలీగర్ యూనివర్సిటీ నుంచి డీ లి ట్ అందుకున్నారు. హిందీ, ఉర్దూ, కన్నడ భాషల్లో ప్రావీణ్యాన్ని సంపాదించారు. జర్మన్ భాషలో డిప్లొమా కూడా చేయడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కోఠి మహిళా కాలేజీని, ఇప్పుడు మనం చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయంగా పిలుచుకుంటున్నాం. ఈ కాలేజీలోనే యశోదారెడ్డి తెలుగు అధ్యాపకురాలిగా కెరీర్ ప్రారంభించారు.
తర్వాత ఉస్మాని యా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ పాఠాలు బోధించారు. ఆమె బోధనల ప్రభావం అనేక తరాలపై పడింది. ఆమె ప్రోత్సాహంతో ఎంతోమంది విద్యార్థులు సాహితీవేత్తలుగా ఎదిగారు. ఆమెలోని విమర్శనాత్మక దృక్పథం, సూక్ష్మ పరిశీలన ఆమె రచనల్లో కనిపిస్తాయి. ఆచార్యురాలి గా ఆమె ఉస్మానియా తెలుగు శాఖ నుంచి పదవీవిరమణ చేసిన తర్వాత, వర్సిటీ అకడమిక్ కౌన్సిల్ మెంబర్‌గా, కేంద్ర సాహిత్య అకాడమీ మెంబర్‌గా పనిచేశారు. అధికార భాషా సంఘం తొలి మహిళా అధ్యక్షురాలిగా విశిష్ట సేవలందించారు.
రచనల విశిష్టత..
యశోదారెడ్డి ‘మావూరి ముచ్చట్లు’ కథల సంపుటి, దివాకర్ల వెంకటావధాని పర్యవేక్షణలో ‘తెలుగులో హరివంశము లు’ అనే సిద్ధాంత వ్యాస గ్రంథం,-భారతం లో స్త్రీ, పారిజాతాపహరణం పర్యాలోచ నం, ద్విపద వాజ్ఞయం, ప్రబంధ వాజ్ఞ యం, కథా చరిత్ర (ప్రామాణిక రచన), భారతీయ చిత్రకళ, ధర్మశాల (కథా సంపు టి), భాగవత సుధ, ఎచ్చమ్మ కథలు (కథా సంపుటి), ఉగాదికి ఊయ్యాల, భావిక వంటి గొప్ప రచనలు చేశారు.
ఇన్ని రచనల్లో యశోదారెడ్డికి పేరు ప్రాఖ్యతలు తీసుకోచ్చిన రచన మాత్రం ‘మా ఊరి ముచ్చట్లు’. ఈ కథా సంపుటిలో తెలంగా ణ పల్లెటూరి జీవితం, గ్రామాల్లోని సరళమైన భాష, హాస్యం తొణికసలాడతాయి. కథలు ప్రజల కష్టాలను ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా తెలంగాణ మాండలికం ఈ రచనలకు ప్రత్యేకమైన అందాన్నిచ్చింది. అచ్చమైన తెలంగాణ మాండలికంలో ‘ఆకాశవాణి’లో ప్రసంగం చేసిన తొలి రచ యిత్రిగా యశోదారెడ్డి కావడం విశేషం.
ఆమె పేరెన్నిక గల రచనల్లో ‘ఎచ్చమ్మ కథల’దీ ప్రత్యేక స్థానం. ఈ కథలు ఆమెలోని హాస్య ప్రియత్వాన్ని, సున్నితమైన భావాలను తెలియజేస్తాయి. ఎచ్చమ్మ అనే గ్రామీణ మహిళ పాత్ర ద్వారా రచయిత్రి.. నాటి సాంఘిక విషయాలను ఆమె హాస్యభరితంగా, ఆలోచింపజేసే విధంగా విశదీ కరించారు.
‘ధర్మశాల’ కథా సంపుటిలో రచయిత్రి తెలంగాణ గ్రామీణ జీవితంలో ఉండే సంప్రదాయాలు, విలువలు, మారుతున్న సమాజ ప్రభావాలను అద్భుతంగా చిత్రీకరించారు. రచయిత్రిది సాహిత్య రం గంలో ఒక అరుదైన వ్యక్తిత్వం. ఆమె కథా రచయిత్రిగా తెలంగాణ జీవితానికి, భాష కు గుర్తింపు తెచ్చారు. ఆమె కొంతకాలం ‘కల్పనా శ్రీ’ అన్న కలం పేరుతో కూడా రచనలు చేశారు.
సాహిత్య రంగంలో ఆమె చేసిన కృషికి ఆమెను ఆం.ప్ర సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి పురస్కారం, సుశీలా నారాయణరెడ్డి పురస్కారం, నాళం కృష్ణారావు పురస్కారం, సురవరం ప్రతాపరెడ్డి పురస్కారాలు వరించాయి. యశోదారెడ్డి రచనల్లోని తెలంగాణ మాం డలికంపై ఎంతోమంది పరిశోధకులు పరిశోధన చేసి డాక్టరేట్లు పొందడం విశేషం. ఇన్ని ఘనతలు సాధించిన యశోదారెడ్డి 7 అక్టోబర్ 2007న పరమపదించారు.
పల్లె సతీశ్
వ్యాసకర్త సెల్: 9010953659