26-07-2025 12:13:19 AM
భువనేశ్వర్, జూలై 25: అటవీ శాఖ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు కలకలం సృష్టిం చాయి. ఒడిశాలోని జయపూర్ రేంజ్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ రామచంద్ర నేపక్ ఇంట్లో శుక్రవారం విజిలెన్స్ అధికారులు సో దాలు నిర్వహించారు. ఏకకాలంలో ఆయన ఇల్లు, ఆఫీస్ సహా ఆరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి భారీగా నగదుతో పాటు బం గారం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 16 బంగారు నాణేలు, రూ. 1.44 కోట్ల నగ దు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు.
ఒక్కో బంగారు నాణెం 10 గ్రాముల వరకు ఉన్నట్టు తెలిపారు. జయపూర్‌లో అతడు ని వాసం ఉన్న అపార్ట్‌మెంట్‌లో గుట్టలు గుట్టలుగా నగదు బయటపడటంతో లె క్కి ంచేందుకు కరెన్సీ కౌంటింగ్ మెషిన్‌ను తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆయన నివాసంతో పాటు పని చేసిన కార్యాలయం, అత్తవారిల్లు, భువనేశ్వర్‌లోని ఆయన సోదరుడి ఇంట్లోనూ సో దాలు కొనసాగుతున్న ట్టు అధికారులు వెల్లడించారు. ౪ రోజుల క్రితం నిత్యానంద నా యక్ అనే అటవీ అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించగా.. 115 ప్లాట్లు ఉన్నట్టు తేలిన సంగతి తెలిసిందే.