calender_icon.png 27 July, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారమితలో ఘనంగా కార్గిల్ విజయ దినోత్సవ వేడుకలు

26-07-2025 06:53:29 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): పారమిత హెరిటేజ్ పాఠశాల(Paramita Heritage School)లో కార్గిల్ విజయ దినోత్సవం వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఆర్మీ కెప్టెన్ నరెడ్డి ఇంద్రాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు దేశభక్తిని ప్రతిబింబించే నృత్యాలు, గీతాలు ఆలపించి కార్గిల్ యుద్ధ అమర వీరులకు నివాళులు అర్పించారు. పాఠశాల ప్రధానోపాద్యాయులు, సమన్వయ కర్తలు, ఉపాద్యాయ సిబ్బంది రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంద్రాకర్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల చైర్మన్ డా. ఇ.ప్రసాద్ రావు, డైరెక్టర్లు ప్రసూన, రష్మిత, అనూకర్ రావు, టి.యస్.వి.రమణ, వినోద్ రావు, హన్మంతరావు, ప్రధానోపాధ్యాయుడు గోపీకృష్ణ, కోఆర్డినేటర్లు నాగరాజు, రాము, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.