26-07-2025 07:04:49 PM
కరీంనగర్,(విజయక్రాంతి): నూతనంగా నిర్మాణం చేస్తున్న బాలసధనం భవనం, కాశ్మీర్ గడ్డ సమీకృత మార్కెట్ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి శనివారం రోజు క్రిస్టియన్ కాలనీలో 2 కోట్ల నిధులతో నూతనంగా నిర్మాణం చేస్తున్న బాలసదనం భవన నిర్మాణం పనులను కమీషనర్ తనిఖీ చేసి పరిశీలించారు.
ప్రస్తుతం జరుగుతున్న భవనం నిర్మాణ దశ అభివృద్ధి పనుల పై కాంట్రాక్టర్ ను ఆరా తీశారు. పనుల వేగవంతం పై కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మరో వైపు కాశ్మీర్ గడ్డ రైతు బజార్ స్థలంలో రూ.10 కోట్ల నిధులతో నగరపాలక సంస్థ నిర్మాణం చేస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అభివృద్ధి పనులను పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.... బాలసధనం భవనంతో పాటు కాశ్మీర్ గడ్డ రైతు బజార్ సమీకృత మార్కెట్ భవన నిర్మాణం పనులను అధికారులు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీస్కోవాలన్నారు.
నాణ్యత ప్రమాణాలతో భవన నిర్మాణం పనులను పూర్తి చేయాలన్నారు. బాలసధనం భవనం నిర్మాణం చివరి దశ పనులను నెల రోజుల్లో పూర్తి చేసి....ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలన్నారు. కాశ్మీర్ గడ్డ రైతు బజార్ మార్కెట్ నిర్మాణం పనులను కూడ నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీస్కోవాలన్నారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. జరుగతున్న అభివృద్ధి పనుల పై అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈలు వెంకటేశ్వర్లు, అయూబ్ ఖాన్, ఏఈ సతీష్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు