calender_icon.png 27 July, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రిలో పిచ్చికుక్కలకు వైద్యం లేదు

26-07-2025 06:56:36 PM

జిల్లా ఆసుపత్రికి వెళ్ళండి... ఆసుపత్రి వైద్యుల సూచన 

ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెడుతున్న ప్రజలు 

పిచ్చికుక్కల నుండి కాపాడండి సార్

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల్లో కూడా ప్రజలు తమ పనుల నిమిత్తం బయటకు రావడంతో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని గాంధీనగర్, పలు రహదారుల్లో వీధుల్లో పిచ్చికుక్కలు విపరీతంగా మనుషులపై దాడులు చేస్తున్నాయి. వైద్యం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులు వెళ్లినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు కుక్కలకు వైద్యం ఇక్కడ లేదని జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని క్షతగాత్రులకు సూచిస్తున్నారని బాధితులు అధికారులపై నాయకులుపై మండిపడుతున్నారు.

వందల కోట్ల రూపాయలతో అధునాతన ప్రభుత్వాసుపత్రి భవనం నిర్మాణం జరుగుతుందని గొప్పలు చెప్పడం తప్ప పిచ్చి కుక్కలకు మందు దొరక క ప్రజలు రోదిస్తున్నారు. వార్డులలో ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కుక్కలు గర్జిస్తున్నాయని అధికారులకు పలు మార్లు విన్నవించిన కుక్కలు కరిచే దాకా అధికారులు స్పందించడం లేదు. కుక్కలు కరిచాయి సార్ అంటూ ఆసుపత్రికి వైద్యం నిమిత్తం రావడంతో వైద్యులు కుక్కలకు చికిత్స లేదని జిల్లా ఆసుపత్రిలో మాత్రమే మందులు ఉన్నాయని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు.

నాయకులు మాత్రం అదిగో ఆసుపత్రి పనులు పూర్తికావచ్చినయ్ ఆసుపత్రిలో వైద్యులు కొరత లేదని మాటలు చెబుతూ మొఖం చాటేస్తూ తమ యొక్క కాలం గడుపుతున్నారు. కానీ ప్రజల ప్రాణాలను పట్టించుకునే నాయకుడే కరువయ్యారు. కనీసం మానవతా దృక్పథంతో మమ్మల్ని రక్షించండి సార్ అంటూ ప్రజలు అధికారులను నాయకులను వేడుకుంటున్నారు. రెండు రోజుల్లో ఎల్లారెడ్డి పట్టణంలో 10 మందికి పైగా కుక్కలు కరిచినట్లు శత గాత్రులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి ప్రత్యేక వైద్యులు మాట్లాడుతూ... ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో వైద్యం ఉన్నప్పటికీ అత్యధికంగా గాయాలైన క్షతగాత్రులకు కావలసిన మందులు లేకపోవడంతో జిల్లా ఆసుపత్రికి పంపించినట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజు పలువురికి కుక్కకాటుకు వైద్యం అందిస్తున్నప్పటికీ అత్యధికంగా గాయాలు అయిన వారికి అత్యవసర పరిస్థితుల్లో జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సూపరిండెంట్ రవీంద్ర మోహన్ తెలిపారు. త్వరలోనే అతి ముఖ్యమైన మందులను కూడా ఆస్పత్రి లో అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు.