calender_icon.png 27 July, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల క్రయ విక్రయాలను ఆధార్ కార్డుతో ఎంట్రీ చేయాలి

26-07-2025 07:00:28 PM

రైతులకు అవసరమైన యూరియాను మాత్రమే సరఫరా చేయాలి

జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

జగిత్యాల అర్బన్,(విజయక్రాంతి): ఎరువుల క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా ఆధార్ కార్డుతో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.శనివారం  ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం కేంద్రంలోని ప్యాక్స్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యూరియా, ఇతర ఎరువుల స్టాక్ వివరాలను పరిశీలించారు. యూరియా ప్రతీ రైతుకి ఎన్ని బస్తాలు సరఫరా చేస్తున్నారో పరిశీలించి వారి భూమి వివరాలను తనిఖీ చేశారు. ప్రస్తుతం రైతులు వేసిన పంటకు అవసరమైన యూరియాను మాత్రమే సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. ఎవరికైనా ఎక్కువ మొత్తంలో యూరియా బస్తాలు పంపిణి  చేసినట్లయితే అట్టి సొసైటీ సిబ్బంది పై, వ్యవసాయ శాఖ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పని అధికారులను హెచ్చరించారు.