calender_icon.png 27 July, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట వాసి కొండ అశోక్ కుమార్ కు డాక్టరేట్‌ పట్టా

26-07-2025 06:50:46 PM

సిద్దిపేట: సిద్దిపేట పట్టణం గణేష్ నగర్ కు చెందిన కొండ అశోక్ కుమార్ కు శనివారం ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) డాక్టరేట్‌ పట్టా లభించింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అశోక్ విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ ప్రశాంత్ సింగం సూపర్వైజర్ ఆధ్వర్యంలో బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన చేశారు. అతను,"మొలిక్యులర్ క్లోనింగ్, ఇన్సిలికో క్యారెక్టరైజేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ అనాలసిస్ ఆఫ్ స్నాక్ 1 ఎన్కోడింగ్ జీన ఆఫ్ జియా మేస్ ఫర్ డ్రాట్ స్ట్రెస్" అనే అంశంపై పరిశోధన చేసినందుకు ఉస్మానియా యూనివర్సిటీ కొండ అశోక్ కుమార్ కు డాక్టరేట్‌ పట్టా ప్రధానం చేసింది. కాగా డాక్టరేట్‌ పొందిన అశోక్ ను హెచవోడీ ప్రొఫెసర్ సురేఖ రాణి, డాక్టర్‌ సుమలత, డాక్టర్ విజయ్, బయోటెక్నాలజీ సిబ్బంది, సహోద్యోగులు, మిత్రులు, బంధువులు శుభాకాంక్షలు తెలిపారు.