calender_icon.png 27 July, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో వాగులో చిక్కుకున్న 15 మంది విద్యార్థులు

26-07-2025 06:48:13 PM

ట్రాక్టర్లతో వాగు దాటించినా పోలీసులు, గ్రామస్తులు..

కామారెడ్డి జిల్లా అమర్ల బండ వద్ద ఘటన..

ఒడ్డుకు చేరడంతో ఊపిరి పీల్చుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు..

పోలీసులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థుల తల్లిదండ్రులు..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో వాగు నీటిలో 15 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. పోలీసులు, గ్రామస్తులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఓడ్డుకు చేర్చిన ఘటన కామారెడ్డి జిల్లా(Kamareddy District) సదాశివ నగర్ మండలం అమర్లబండ రాజగుండ వాగు వద్ద శనివారం ఘటన చోటుచేసుకుంది. అమర్ల బండ గ్రామానికి చెందిన 15 మంది విద్యార్థులు ప్రతిరోజు సమీపంలోని ధర్మరావుపేట  గ్రామంలో ఉన్నత పాఠశాలలో చదువుకునేందుకు వెళ్తారు. ప్రతి రోజులాగే శనివారం ఉదయం ధర్మ రావు పేట  ఉన్నత పాఠశాలలో చదివేందుకు వెళుతుండగా అమర్ల బండ రాజా గుండ వాగు ప్రవాహం ఎక్కువగా రావడంతో వాగు నీటిలో 15 మంది విద్యార్థులు చిక్కుకున్నారు.

ఈ  విషయాన్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్థానిక సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్ గౌడ్, ఎస్సై పుష్ప రాజ్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, గ్రామస్తులు వాగు వద్దకు వెళ్లి  గ్రామంలో ఉన్న నాలుగు ట్రాక్టర్లా ద్వారా వాగు నీటిలో చిక్కుకున్న విద్యార్థులకు భయాందోళన చెందవద్దంటూ తాము కేజీవిల్ ట్రాక్టర్ ద్వారా వస్తున్నామని భయపడవద్దంటూ చెప్పి గ్రామంలోని నాలుగు ట్రాక్టర్ల ద్వారా వాగులోకి వెళ్లి వాగు నీటిలో చిక్కుకున్న 15 మంది విద్యార్థులను ఒడ్డుకు చేర్చారు. దీంతో  విద్యార్థులు గ్రామస్తులు రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ట్రాక్టర్ల ద్వారా తమ పిల్లలను బయటకు తెచ్చినందుకు పోలీసులకు, గ్రామస్తులకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.15 మంది విద్యార్థులు అపాయం నుంచి బయటపడడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఆపాయకరంగా ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కోరారు. బ్రిడ్జి నిర్మాణం చేపడితే గ్రామస్తులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. వ్యవసాయ పనులకు వెళ్లాలన్న వాగు నీటి ప్రవాహం తగ్గుతేనే వెళ్తామని లేకుంటే గ్రామంలోనే ఉండాల్సి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. గత 15 రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఆరుగురు రైతులు వ్యవసాయ పనులకు వెళ్లి వాగు  వరద నీటిలో చిక్కుకున్నారని గ్రామస్తులు తెలిపారు. ట్రాక్టర్ల సాయంతో వారిని ఒడ్డుకు చేర్చామని పేర్కొన్నారు. ప్రతిసారి వర్షాలు కురిసినప్పుడు తమ గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గతంలో సైతం ఎమ్మెల్యే దృష్టికి తెచ్చామని గ్రామస్తులు పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మించాలని అధికారుల దృష్టికి గతంలో ఎన్నోసార్లు వివరించామని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణానికి నిధుల మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.