15-05-2025 10:42:56 PM
అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్..
నిర్మల్ (విజయక్రాంతి): రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్(Additional Collector Faizan Ahmed) అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయన ఈ పథకం లబ్ధిదారుల ఎంపికపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిశీలన, ప్రస్తుత స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, మండలాల వారీగా ఎంపిక ప్రక్రియను రేపటిలోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైనవాటిని బ్యాంకులకు పంపించే ప్రక్రియను వేగంవంతం చేయాలన్నారు. బ్యాంకులకు చేరిన దరఖాస్తుల పరిశీలనను త్వరగా పూర్తి చేయాలని బ్యాంకు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ గోవింద్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, బీసీ సంక్షేమ పాల్గొన్నారు.