calender_icon.png 25 September, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిక్స్‌డ్ డిపాజిట్ల పేరుతో భారీ మోసం

25-09-2025 12:25:28 AM

ఇద్దరు కేటుగాళ్ల అరెస్ట్, ఇతర రాష్ట్రాల్లో బ్రాంచ్‌లు రూ.8.50 కోట్ల వసూళ్లు 

నిజామాబాద్, సెప్టెంబర్ 24 (విజయ క్రాంతి): ఫిక్స్‌డ్ డిపాజిట్ల పేరుతో భారీ మోస నీకి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి ప్రభుత్వ చట్టపరమైన అనుమతులు లేని కంపెనీల పేరుతో అమాయక ప్రజల నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైం బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర చారి తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

2022లో శ్రేమ్ ఎవర్ గ్రీన్ కంపెనీ పేరుతో నగరంలోని హస్మీ కాలనీకి చెందిన మొయిజ్ ఖాన్ (32) ఓ సంస్థను కొంతమంది మిత్రులతో కలిసి ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసి డబ్బులు వసూళ్ల కు పాల్పడ్డాడని ఆయన తెలిపారు. ప్రజలకు అత్యధికంగా వడ్డీని ఇప్పిస్తామంటూ నమ్మబలికి డిపాజిట్లను భారీమొత్తంలో సేకరించినట్టు ఆయన తెలిపారు.

వీరిచేతిలో మోసపోయిన ఇందల్వాయికి చెందిన ఉపాధ్యాయుడు హకీం ఇందల్వాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మీరు బాగోతం బట్టబయలైంది. తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తులో భాగంగా 2022 నుంచి ఇప్పటివరకు సుమారు 125 మందిని మోసం చేసి వారి వద్ద నుంచి కోట్ల రూపాయల డబ్బుల డిపాజిట్ల ను దండుకున్నారు.   దేశవ్యాప్తంగా రూ. 8.50 కోట్ల వసూలు చేశారని ఎసిపి నాగేంద్ర చారి తెలిపారు.

దేశంలోని ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో మీటింగ్‌లను ఏర్పాటు చేసి ప్రజలను మోసగించి పశువులకు పాల్పడ్డారన్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బ్రాంచ్‌లను కూడా నెలకొల్పారు. అమాయక ప్రజల నుండి డిపాజిట్ ల పేరుతో చీటింగ్ చేసిన నిజామాబాద్ నగరానికి చెందిన మోయిజ్ ఖాన్, వాజిద్ హుస్సేన్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీసీఎస్ ఏసీపీ తెలిపారు. జిల్లాలో ఇంకెవరైనా వీరి బారిన పడి మోసపో యిన వారు సీపీకి ఫిర్యాదు చేయాలని ప్రజలకు ఆయన సూచించారు.