11-08-2025 01:24:20 AM
- భారత విమానాలకు గగనతలం మూసేసిన పాక్
- రెండు నెలల్లో 1240 కోట్ల నష్టం
ఇస్లామాబాద్, ఆగస్టు 10: ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత విమానాలకు గగనతలాన్ని నిషేధించిన పాకిస్థాన్‌కు భారీ నష్టం వాటి ల్లింది. ఈ నిర్ణయం తీసుకున్న అనంతరం రెండు నెలల కాలంలో రూ. 1240 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు, భారత విమానాల రద్దు నేపథ్యంలో 20 శాతం మేర ఎయిర్ ట్రాఫిక్ తగ్గినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ పాకి స్థాన్ జాతీయ అసెంబ్లీకి తెలిపింది. ఇప్పటికే అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు తాజా నిర్ణయం పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఈ మేరకు పాక్‌కు చెందిన డాన్ పత్రిక కథనం ప్రచురించింది.