11-08-2025 01:25:44 AM
- నెలల వ్యవధిలో ఇది రెండోసారి
- పర్యటన తేదీ వెల్లడించని పాక్ ఆర్మీ
న్యూఢిల్లీ, ఆగస్టు 10: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ అగ్రరా జ్యం అమెరికాలో పర్యటిస్తున్నా రు. నెలల వ్యవధిలో పాక్ ఆర్మీ చీఫ్ అమెరికాలో పర్యటించడం ఇది రెండో సారి. ఆపరేషన్ సిందూర్ అ నంతరం అగ్రరాజ్య పర్యటనకు వెళ్లి న మునీర్.. అధ్యక్షుడు ట్రంప్‌తో విందులో కూడా పాల్గొన్నారు.
ఈ సారి పర్యటనకు సంబంధించి పాక్ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది కానీ అందులో పర్యటన వివరాలు, ఎప్పుడు వెళ్తారు? ఎన్ని రోజులు అక్కడ ఉంటారనే వివరాలు తెలపలేదు. యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ మైఖేల్ ఈ. కురిల్లా పదవీవిరమణ కోసం మునీర్ అక్కడకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో కూడా మునీర్ పాల్గొన్నా రు. అమెరికాకు చెందిన ఇతర సైనికాధికారులతో కూడా సమావేశమ య్యారు. మునీర్ పర్యటనకు పాకిస్థాన్ పత్రిక ‘డాన్’ కూడా నిర్దారిం చింది. జూన్‌లో ఐదు రోజుల పాటు మునీర్ అమెరికాలో పర్యటించారు.