21-10-2025 06:12:40 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం పది అడుగుల కొండచిలువ కలకలం సృష్టించింది. గ్రామంలోని డంపింగ్ యార్డ్ వద్ద కొండచిలువ వుందని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు లక్షెట్టిపేట అటవీ శాఖ పరిధిలోని పెద్దంపేట సెక్షన్ అధికారి అల్తాఫ్ హుస్సేన్, బీట్ అధికారి రాజశేఖర్, చంద్ర శేఖర్, ముజ్జు, స్నేక్ క్యాచర్ అబ్బుషెక్ వెళ్ళి కొండచిలువను రెస్క్యూ చేసి చెల్లంపేట అటవీ ప్రాంతంలో వదిలి పెట్టడం జరిగిందని తెలిపారు.