calender_icon.png 22 October, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు

21-10-2025 06:16:25 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు తమ సొంతం అవుతుందని కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్ ప్రిన్సిపాల్ పి. అరుణ్ జ్యోతి రెడ్డి అన్నారు. తెలంగాణ యూత్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రీడోత్సవాలు పోచారం మున్సిపల్ ఇస్మాయిల్ ఖాన్ గూడలోని ఎస్టి. పీటర్ శాంతినికేతన్ హైస్కూల్లో నిర్వహించారు. ఈ క్రీడల్లో మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు స్కూల్స్ సుమారు 900 వందలపై చిలుకు విద్యార్థులు పాల్గొనగా అందులో కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్ చెంగిచెర్ల బ్రాంచ్ కి చెందిన విద్యార్థులు అండర్ 14  కబడ్డీ, ఖోఖో క్రీడలలో బాలురు విజయం సాధించగా అండర్ 14  ఖోఖో లో బాలికలు రెండవ స్థానాన్ని గెలుచుకున్నారు. ఇందులో గెలిచిన విద్యార్థులు జాతీయ స్థాయిలో ఎంపిక కావడం వల్ల ఆయొక్క స్కూల్  ప్రిన్సిపాల్  పి. అరణ్ జ్యోతి రెడ్డి, డైరెక్టర్ జి. శశికాంత్ రెడ్డి, విద్యార్థులకు, విద్యార్థినులకు శిక్షణ ఇచ్చిన పిఈటి జి. నరేష్ ను అభినందించి విద్యార్థుల పట్ల  హర్షం వ్యక్తం చేశారు.