21-10-2025 06:10:38 PM
వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్..
వరంగల్ (విజయక్రాంతి): ఉర్సు కరీమాబాద్ సెంటర్ లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహాన్ని సోమవారం రాత్రి కొంతమంది దుండగలు ధ్వంసం చేయగా బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యులు ఈ రోజు ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ మూడు శతాబ్దాల క్రితమే వెనుకబడిన తరగతుల ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప త్యాగశీలైనటువంటి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కొంతమంది దుండగలు విధ్వంసం చేయడం బాధాకరమని, బీసీ ఉద్యమం ఎదుగుదలను ఓర్వలేని కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులే వెనుక ఉండి ఇలాంటి సంఘటనకు పాల్పడుతున్నారని, అలాంటి వ్యక్తులను గుర్తించి పోలీస్ లు కఠినంగా శిక్షించాలని కోరారు.
అలాగే ప్రభుత్వం బాధ్యత తీసుకొని వెంటనే కొత్త పూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే బీసీ జేఏసీ ఉపేక్షించదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్ బోనగాని యాదగిరి గౌడ్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ దొడ్డిపల్లి రఘుపతి, జేఏసీ సభ్యులు కురుమిళ్ల శ్రీనివాస్ గౌడ్, చాగంటి రమేష్, సమ్మయ్య, పూజారి విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.