calender_icon.png 5 May, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ,ప్రదర్శన

29-04-2025 12:08:28 AM

తహసీల్దార్ కార్యాలయం ముట్టడి

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు: అన్నవరపు కనకయ్య

మణుగూరు ఏప్రిల్ 28, (విజయ క్రాంతి) రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిపిఎం మణుగూరు మండల కమిటీ ఆధ్వర్యంలో పట్టణ ములో భారీ ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య మాట్లాడు తూ,కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఊదరగొట్టి ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకపోవడం దారుణం అన్నారు. కనీసం 6 గ్యారంటీ లైన అమలు చేస్తారని ప్రజలు కొండంత ఆశతో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో ఒక్క సంక్షేమ పథకం కూడా అమలుకు నోచుకోకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ ప్ర భుత్వం పై వ్యతిరేక జ్వాలలు వినిపిస్తున్నాయన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు అమలవు తుంది కానీ ఉచిత కరెంటు గ్యాస్ సబ్సిడీలు అరకొరగా వస్తున్నాయని ఆరోపించారు.

ఆత్మీయ భరోసా పేరుతో రూ 12,500 ఇస్తామని,  మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు నెలకు రూ 2,500 ఇస్తామని చెప్పిన హామీలన్నీ అటకెక్కించారని ఎద్దేవా చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండిప డ్డారు. వృద్ధాప్య, వితంతువు,వికలాంగుల, ఒంటరి మహిళల పింఛన్లు పెంచి ఇస్తామని చెప్పి వాటి ఆచూకే లేదని ఆరోపించారు. రాజకీయ జోక్యం లేకుండా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్,సిపిఎం మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు,సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు,కొడిశాల రాములు,నైనారపు నాగేశ్వరరావు,దామల్ల లెనిన్ బాబు,పిట్టల నాగమణి,ఉప్పతల నరసింహారావు,కోండ్రు గౌరి, తదితరులు పాల్గొన్నారు.