రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ మండల(Mahabubabad Mandal) పరిధిలోని అయోధ్య క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముడుపుగల్లు గ్రామానికి చెందిన చందా అరుణ్ కుమార్(25) యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మహబూబాబాద్ రూరల్ ఎస్ఐ దీపిక(SI Deepika) కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ట్రాలీ వాహనం ఇండికేటర్ వేయకుండా మలుపు తిరగడం వల్ల వెనక అరుణ్ కుమార్ ద్విచక్ర వాహనంపై వస్తు ఢీకొట్టి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. అరుణ్ కుమార్ మహబూబాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మెడికల్ ల్యాబ్ లో పనిచేస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి తండ్రి రవి మరణించగా ఇంటికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న అరుణ్ కుమార్ అకాల మృత్యువాత పడడంతో తల్లి రమ, సోదరుడు కన్నీరు మున్నీరయ్యారు.






