calender_icon.png 29 December, 2025 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాక్సిక్‌లో ఎలిజబెత్‌గా హుమా ఖురేషి

29-12-2025 12:46:40 AM

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ నిర్మిస్తున్నారు. యష్, గీతూ మోహన్దాస్ కలిసి కథను రాసి.. గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా 2026 మార్చి 19న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

తాజాగా మేకర్స్ సినిమాలో ఎలిజిబెత్ పాత్రలో నటిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి ఫస్ట్ లుక్ను విడుదల చేశారు.  వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హుమా ఖురేషి.. ’టాక్సిక్’ ప్రపంచంలోకి అడుగుపెట్టడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఫస్ట్ లుక్‌ను గమనిస్తే.. ఆమె పాత్రలో మిస్టరీ, ఇంటెన్సిటీ అర్థమవుతోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాధ్యతలను రాజీవ్ రవి నిర్వహిస్తుండగా.. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. ఎడిటింగ్ను ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైన్‌ను టీపీ అబీద్ చూసుకుంటున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ (జాన్ విక్ ఫేమ్)తోపాటు అన్బరివ్ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు.