calender_icon.png 29 December, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లపై పార్టీల వైఖరి ప్రకటించాలి

29-12-2025 03:31:57 PM

హనుమకొండ,(విజయక్రాంతి): జిల్లా, మండల ప్రాదేశిక ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందే తమ వైఖరి ప్రకటించాలని బిసి జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. సుబేదారిలో జరిగిన సమావేశంలో జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు తమ వైఖరి ప్రకటించాలని ఆయా పార్టీల అధ్యక్షులకి లేఖలు విడుదల చేశాయి. ఈ సందర్భంగా డాక్టర్ శేషు మాట్లాడుతూ... గ్రామపంచాయతీ ఎన్నికలలో బీసీలకి పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి అన్ని పార్టీలు మోసం చేశాయి.

కాబట్టి గ్రామపంచాయతీ ఎన్నికలలో బీసీలు 4946 అంటే 38.9 శాతం గ్రామపంచాయతీలను మాత్రమే  గెలవగలిగారని అభిప్రాయం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలలో పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కేటాయించలేదు, కాబట్టి జెడ్పిటిసి మరియు ఎంపీటీసీ ఎన్నికలలో చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం లేదు కాబట్టి పార్టీ పరమైన రిజర్వేషన్లు కల్పించడానికి అన్ని పార్టీలు బీసీ లకి 237 జెడ్పిటిసి లను 2424 ఎంపీటీసీ లను బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ధారబోయిన సతీష్, బుట్టి శ్యామ్ యాదవ్, డాక్టర్ ఎర్ర బొజ్జు రమేష్, డాక్టర్ పాలడుగుల సురేందర్, డాక్టర్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.