29-12-2025 03:35:52 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సరోజ దుర్గం తిరుపతి సోమవారం తహసిల్దార్ రామ్మోహన్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీలోని భూ సమస్యలపై మాట్లాడిన ఆమె ప్రజలకు ధ్రువపత్రాలు ఇతర సమస్యలను పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేసిన ఆమె తాసిల్దార్ ను శాలువాతో సన్మానించినట్లు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచుకు తాసిల్దార్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.