calender_icon.png 29 December, 2025 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా సురేశ్‌బాబు

29-12-2025 12:54:00 AM

తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్) ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్‌ప్యానెల్ విజయం సాధించింది. ఫిలిం ఛాంబర్ నూత న అధ్యక్షుడిగా దగ్గబాటి సురేశ్ బాబు ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం 8 నుంచి మ ధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరిగిం ది. అనంతరం సాయంత్రం 4 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. ఈ ఎన్నికల్లో చిన్న నిర్మాతల మద్దతుతో సీ కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు నేతృత్వంలో ‘మన ప్యానెల్’ ఒక వైపు.. మరోవైపు రెగ్యులర్ గా సినిమాలు తీసే నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేశ్ బాబు మద్దతుతో ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ పోటీ చేశారు. ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, స్టూ డియో రంగాల వారు మొత్తం 3,355 మంది సభ్యులు ఉన్నారు.

ఈ ఎన్నికల ద్వారా ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి 31 మంది గెలిచారు. 17 మంది మన ప్యానల్ నుంచి విజయం సాధించారు. రెండు ప్యానెళ్ల తరఫున ఎన్నికల్లో గెలిచిన వాళ్లంతా మళ్లీ తుది కార్యవర్గ ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కార్యదర్శితోపాటు 32 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా దగ్గుబాటి సురేశ్ బాబు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సూర్యదేవర నాగవంశీ, సీ భారత్ చౌదరి, పీ కిరణ్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా ముత్యాల రామదాసును ఎన్నుకున్నారు.

ఇక మిగతా పదవులకు ప్రాంతాల వారీగా బాధ్యులను ఎంపిక చేశారు. హైదరాబాద్ విభాగం కార్యదర్శిగా కొల్లా అశోక్ కుమార్ ను, విజయవాడ విభాగం కార్యదర్శిగా కేవీవీ ప్రసాద్ ను ఎన్నుకున్నారు. సంయుక్త కార్యదర్శుగా ఎం విజ యేందర్ రెడ్డి, మోహన్ వడ్లపట్ల (హైదరాబాద్ విభాగం), జీ వీరనారాయణబాబు (విజ యవాడ విభాగం), జీ మహేశ్వర్ రెడ్డి (గుంతకల్ విభాగం), ఎన్ నాగార్జున (తిరుపతి విభా గం), కే అప్పాల రాజు (విశాఖపట్నం విభా గం) ఎన్నికయ్యారు. కొత్తగా ఏర్పాటైన కార్యవర్గం 2027 వరకు విధుల్లో కొనసాగుతుంది.