03-12-2025 12:30:59 AM
ముంబైలో అత్యవసర ల్యాండింగ్.. బాంబు స్వ్కాడ్‌తో తనిఖీలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కువైట్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో విమానంలో మానవబాంబు ఉందంటూ దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఉన్నతాధికారులకు మంగళవారం తెల్లవారుజామున ఈ - మెయిల్ ద్వా రా బెదిరింపు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇండి గో విమాన పైలెట్‌ను ఉన్నతాధికారులు వెంట నే అప్రమత్తం చేశారు.
దాంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాల్సిన ఈ విమానాన్ని హుటాహుటిన ముంబైకి మళ్లించారు. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన వెంటనే విమానం నుంచి ప్రయాణికులను దింపేశారు. అనంతరం విమానంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. కాగా, ఈ ఇండిగో విమానం మంగళవారం ఉదయం 8.10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది.
ప్రయాణికులు తీవ్ర ఆందోళన
ఇక ఈ బాంబు బెదిరింపు కారణంగా ఇండిగో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ బాంబు బెదిరింపుపై శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులు, ముంబై ఎయిర్‌పోర్ట్ అధికారు లు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ విమానంలో ఎంత మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ఉన్నారనే విషయాన్ని ఆ సంస్థ వెల్లడించ లేదు. కాగా ఈ విమానంలో బాంబు స్వ్కాడ్ లు తనిఖీలు పూర్తి చేశాయి. ఎటువంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.