19-05-2025 12:48:20 AM
పనులు ఇచ్చేందుకు ముందుకు రాని రైతులు
ల్యాండ్ లెవెలింగ్ తీసేయడంతోనే రైతులు ఆసక్తి చూపడం లేదు : ఎపిఓ
కడ్తాల్, మే 18 : ఉపాధి హామీ పథకంలో కూలీలకు పూర్తి స్థాయిలో పనుల కల్పన కా గితాలకే పరిమితం అవుతోంది. వారికి వందరోజుల పనిదినాలు కల్పించడం లేదు.100 రోజుల పనిదినాలు కల్పించడంలో అధికారులు సఫలీకృతులు కాలేదు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో మొత్తం 8115 కు టుంబాలకు జాబ్ కార్డులు ఉన్నాయి. కాగా మొత్తం 14,212 కూలీలు ఉన్నారు. 2025 సంత్సరానికి 2300 పని చేస్తామని రిపోర్టిం గ్ చేసుకున్నారు. అందులో 600 మందికి వందరోజుల పనిదినాలు కల్పించి మిగతా వారికి పనిలేక మొండిచేయి చూపారు. మం డలంలో గతకొన్నాళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
పనులు కల్పించడంలో ఉపాధి హామీ సిబ్బంది విఫలం..?
గ్రామాల్లో ఉపాధిహామీ కూలీలకు పను లు కల్పించడంపై సిబ్బంది పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. ఉన్నతాధికారులు లక్ష్యాన్ని నిర్దేశిస్తేనే పనులపై దృష్టి పెడుతున్నారు.
ప్రతి ఆర్థిక సంవత్సరం లో ముందస్తు గానే గ్రామసభలు నిర్వహించి గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను కూలీల సమక్షంలోనే ఎంపిక చేస్తున్నారు. వ్యవసాయ పనులు ఉండటంతోనే వర్షాకాలంలో చాలా మంది కూలీలు పనులకు వెళ్లడం లేదు. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేస్తే అందరికీ 100 రోజుల పనిదినాలను కల్పించే అవకాశాలు ఉంటాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
కడ్తాల్ మండలంలో పని చేస్తున్నది 600మంది
కడ్తాల్ మండలంలో 24 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. పని చేస్తామని 2300 రిపోర్టింగ్ చేశారు కాని 600మంది ఉపాధి పనులకు హాజరవుతున్నారు. కొన్ని ప్రాంతా ల్లో వేసవిలో ఎండలకు కూలీలు రావడం లేదు.కొన్ని గ్రామాల్లో మాత్రం వేసవిలోనే ఉపాధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
ముందుకు రాని రైతులు
తమ పొలాల్లో ల్యాండ్ లెవలింగ్ పనులను ప్రభుత్వం తొలగించడంతో రైతులు ఎవ్వరు మొగ్గు చూపడం లేదు. జాబ్ కార్డు లు ఉన్న వారికి పని కల్పిస్తామని అధికారులు చెబుతున్న కూలీలు చేసేందుకు పను లు లేక చాలామంది కూలీలు ఉపాధికి దూరమౌతున్నారు. ముక్యంగా ఉపాధిలో పాడుబడిన భూముల్లో పనులు చేయాలని ఆదేశాలు ఉండడంతో ఈజీ వర్క్ లేనందున కూలీలు ఉపాధి పనులపై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలున్నాయి.
ఎక్కువ కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తాం ఉపాధిహామీ పనులకు వచ్చే కూలీలందరికీ పనులను కల్పిస్తున్నాం. చాలామంది కూలీలకు వ్యవసాయ, సొంత పనులు ఉండటంతో ఉపాధి పనులు చేసేందుకు రావడంలేదు. సాధ్యమైనంత వరకు కూలీలకు పనులు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. ఎక్కువ కు టుంబాలకు 100 రోజుల పనిదినాలు కల్పించేలా కృషి చేస్తాం..
ల్యాండ్ లెవలింగ్ తొలగించడంతో రైతులు ముందుకు రాకపోవడంతో కూలీలకు పని కల్పించలేకపోతు న్నాం. రైతులు పొలం వద్ద వివిధ మొక్కలు ఈత, జామ,మల్బరీ టేకు తదితర మొక్కలు నాటితే సైడ్ ఇన్కమ్ ఉంటుంది. కూలీలు పనులకు వస్తే అందరికి ఉపాధి కల్పిస్తాం.
- లలిత, ఏపిఓ కడ్తాల్ మండలం