19-05-2025 12:42:04 AM
- కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములు
- పట్టించుకోని పంచాయతీ, రెవెన్యూ అధికారులు
కొత్తగూడెం మే 18( విజయక్రాంతి); ప రిశ్రమల స్థాపనకు కారు చౌకగా ప్రభుత్వ భూములు పొంది నామమాత్రంగా పరిశ్రమలు స్థాపించినట్టు చేస్తూ ప్రభుత్వ భూము ల్లో అక్రమ వెంచర్లతో స్థిరాస్తి వ్యాపారం జో రుగా సాగుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జి ల్లా చుంచుపల్లి మండలం, రామాంజనేయ కాలనీ పరిసర ప్రాంతంలో యదేచ్చగా ప్ర భుత్వ భూముల్లో అక్రమ వెంచర్లు గెలుస్తున్నాయి. సర్వే నెంబరు 137/1. 20 కుంటల ప్రభుత్వ భూమి కబ్జా చేసి ఈ భూమికి త ప్పుడు సర్వే నెంబర్ 137/2/A చూపి ప్రైవే ట్ పట్టా భూమి పేరుతో కాగితాలు సృష్టించారు.
2004 సంవత్సరంలో విజయవాడ కు చెందిన నాగ వెంకట శ్రీలక్ష్మి ఈ భూ మిని కొనుగోలు చేసి, బండా రామిరెడ్డి వద్ద నుండి ఓ అట్టల ఫ్యాక్టరీ నిర్మాణం చేశారు. ఈ ఫ్యాక్టరీ కి ఎలాంటి అనుమతులు లేవని ఆరోపణలు ఉన్నాయి. మరో చోట ఉన్న శ్రీ పద్మాలయ పేపర్ బోరడ్స్ అనే ఫ్యాక్టరీ అ నుమతు లను చూపుతూ, ప్రభుత్వానికి చె ల్లించాల్సిన పన్నులకు వేగనామం పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి.
పద్మాలయ పేపర్ బోరడ్స్ పాల్వంచ మండలం దంతాల బోర గ్రామానికి చెందిన ఒక గిరిజనుడిని బినామీగా నమోదు చేసినట్లు సమాచారం. ఇటీ వల బినామీ గిరిజనుడికి, కర్మాగారం నిర్వహకులకు మనస్పర్ధలు వెలబడటంతో విష యం వెలుగు చూసింది.
ఒకవైపు అనుమతు లు లేకుండా అట్టాల ఫ్యాక్టరీ నడుపుతూ, మ రోవైపు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ వెంచర్లతో భూదందా సాగుతున్నట్లు తెలుస్తోంది.ఇంత జరుగుతున్న రెవెన్యూ, పంచాయతీ, పరిశ్రమల అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం తో పెద్ద మొ త్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
గతంలో ఈ స్థలంపై ఎల్ టి ఆర్ కేసులు నమోదైన ఎటు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ కల్పించుకొని చెంచుపల్లి మండలం ఇండస్ట్రియల్ పార్కు ఏరియాలో జరుగుతున్న భూధందా పై సమగ్ర విచారణ జరిపించి ప్రభుత్వ భూములను పరిర క్షించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.