22 June, 2026 | 3:02 AM

రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలకు గాయాలు

22-06-2026 12:00 AM

వేములపల్లి, జూన్ 21: ఆటో బైక్ ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన వేములపల్లి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన సోమయ్య జ్యోతి దంపతులు బైకుపై సూర్యాపేట నుంచి వస్తున్న క్రమంలో రావులపెంట గ్రామ శివారులో బ్రిడ్జిపై వద్దకు రాగానే బ్రిడ్జి పక్కన ఉన్న దారిలో నుంచి అతివేగంగా వచ్చిన ఆటో గా ల్లోకి ఎగిరి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బ్పై ఉన్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యా యి. ఈ ప్రమాదంలో భర్త సోమయ్యకు కా లు విరగగా, జ్యోతి స్పృహ తప్పి పడిపోగా పక్కనే ఉన్న ఓ మహిళ సిపిఆర్ చేసింది. వెంటనే స్థానికులు 108 సహాయంతో మి ర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. ప్రస్తుతం వాళ్ల పరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.