22 June, 2026 | 3:01 AM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు తల్లీబిడ్డల ఆరోగ్యమే మా లక్ష్యం

22-06-2026 12:00 AM

నేరేడుచర్ల పి.హెచ్.సి వైద్యాధికారిని పి. నాగిని

నేరేడుచర్ల, జూన్ 21 (విజయక్రాంతి): నేరేడుచర్ల పీహెచ్సీలో మరో విజయవంతమైన సాధారణ ప్రసవం అయినదని వైద్యాధికారిణి పి. నాగిని అన్నారు. పాలకవీడు మండలం యల్లాపురం గ్రామానికి చెందిన ఎస్.కే. రేష్మ, అక్బర్ దంపతులు ఆదివారం నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సురక్షితంగా సాధారణ ప్రసవం ద్వారా 3.2 కిలోల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

గర్భధారణ కాలం నుండి ప్రసవం వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న నాణ్యమైన వైద్య సేవలు, నిరంతర పర్యవేక్షణ వల్ల ఈ ప్రసవం సాఫీగా జరిగిందని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ఈ సందర్భంగా డా. పున్న నాగిని మాట్లాడుతూ, గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని, సురక్షిత మాతృత్వం కోసం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏ.ఎన్.ఎం లు, స్టాఫ్ నర్సులు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొని తల్లీబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు.