calender_icon.png 17 July, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్య కేసులో భార్య, భర్తల రిమాండ్

13-07-2025 10:05:57 PM

మేడ్చల్ అర్బన్: వ్యక్తిని హత్య చేసిన కేసులో భార్యాభర్తలను మేడ్చల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. ఎదునూరి నరసింహులు అతని భార్య అనిత మృతుడు నరసింహులు చెత్త ఏరుకొని వాటిని అమ్మితే వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్(Medchal Police Station) పరిధిలోని చెక్పోస్టులో ఉన్నటువంటి వెంకటరమణ వైన్ షాపు వద్ద శనివారం రాత్రి డబ్బుల విషయంలో మెదక్ జిల్లాకు చెందిన నరసింహులు(37)ను అనిత ఆమె భర్త నరసింహులు కర్రలతో దాడి చేయగా మృతి చెందాడు. నరసింహులు మృతదేహాన్ని గమనించిన వైన్ షాపు క్యాషియర్ దాసరి మహేష్ మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులైన నరసింహులు అతని భార్య అనితను ఆదివారం మధ్యాహ్నం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు మేడ్చల్ పోలీసులు వెల్లడించారు.